Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ప్రభుత్వ కానుక.. మొదలైన బతుకమ్మ చీరల పంపిణీ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. అక్టోబర్ 6 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు నుంచే పంపిణీ మొదలుపెట్టారు. ఈ ఏడాది 1.08 కోట్ల మహిళలకు చీరలను పంపిణీ చేయనుంది.

bathukamma sarees distribution started
Author
Hyderabad, First Published Oct 2, 2021, 12:38 PM IST

హైదరాబాద్: తెలంగాణ ఆడపడుచులకు కేసీఆర్ ప్రభుత్వం కానుక అందజేస్తున్నది. ప్రతియేటా బతుకమ్మ పండుగకు ముందు 18ఏళ్లు నిండి రేషన్ కార్డులో పేరు నమోదైనవారందికీ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నది. ఈ రోజు నుంచే పంపిణీ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జిల్లా గోదాములకు చీరలు సరఫరా అయ్యాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల ఇప్పటికే పంపిణీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

 

శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. పటాన్‌చెరు, రామచంద్రాపురం, భారతి నగర్ డివిజన్‌లలోనూ మహిళలకు చీరల పంపిణీ ప్రారంభమైంది. ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ మొదలైంది. హైదరాబాద్ సమీపంలోని మార్కుక్ మండలంలోనూ చీరల పంపిణీ ప్రారంభించారు. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో పంపిణీ ప్రారంభమైంది. ట్విట్టర్ వేదికగా ఆ ఫొటోలనూ పంచుకుంటున్నారు.

ప్రభుత్వం ఈ ఏడాది 1.08 కోట్ల మహిళలకు చీరలను పంపిణీ చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 333.14 కోట్లు ఖర్చు చేసింది. గతేడాది పంపిణీ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభిప్రాయాలు సేకరించారు. ఆయన ఆదేశాల మేరకు ఈ సారి కొత్తగా 19 రంగులు, 17 డిజైన్లతో మొత్తంగా 290 వర్ణాల్లో రూపొందించారు. డాబీ అంచు చీరలు ఈ సారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios