నేడు దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన.. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ ఇదే...
బూర్జ్ ఖలీఫా మీద Batukammaను ప్రదర్శించబోయే తెర( స్క్రీన్) ప్రపంచంలోనే అతి పెద్దది కావడం విశేషం. ఒకేసారి దేశవిదేశాలకు చెందిన లక్ష మంది Burj Khalifa స్క్రీన్ పై బతుకమ్మ ను వీక్షించనున్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. శనివారం సాయంత్రం 9.40 నిమిషాల నుంచి 10.40 నిమిషాల మధ్య ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫా పై బతుకమ్మ వీడియో ప్రదర్శన జరగనుంది.
బూర్జ్ ఖలీఫా మీద Batukammaను ప్రదర్శించబోయే తెర( స్క్రీన్) ప్రపంచంలోనే అతి పెద్దది కావడం విశేషం. ఒకేసారి దేశవిదేశాలకు చెందిన లక్ష మంది Burj Khalifa స్క్రీన్ పై బతుకమ్మ ను వీక్షించనున్నారు.
Telangana పూల పండుగ బతుకమ్మ విశ్వ వేదికపై తన గొప్పతనాన్ని చాటేందుకు సిద్దమైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో శనివారం (23 వ తేదీ) న ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై, బతుకమ్మను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
బతుకమ్మ పండుగ ద్వారా మన సాంస్కృతి, ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు ఎమ్మెల్సీ kalvakunta kavitha ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాయంత్రం దుబాయ్ లో జరగబోయే ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
UAE ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా బుర్జ్ ఖలీఫా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించింది.
2004 జనవరి 6 న బుర్జ్ ఖలీఫా నిర్మాణం మొదలవగా, 2020 జనవరి 4 న ఈ భవనాన్ని ప్రారంభించారు. 829.8 మీటర్ల ఎత్తు గల ఈ భవనంలో మొత్తం 163 అంతస్తులున్నాయి. అత్యంత వేగంతో వెళ్లే 57 అధునాతన సాంకేతికతతో కూడిన లిప్టులను అమర్చారు.
నేటి సాయంత్రం భారత కాలమానం ప్రకారం 9.40 PM కు , 10.40 PM కు రెండు సార్లు బూర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ వీడియో ప్రదర్శించ బడుతుంది.
ఇదిలా ఉండగా, ఈ నెల మొదట్లో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఐరోపా ఖండంలోనే అతిపెద్ద bathukamma వేడుకను లండన్‌లో నిర్వహించారు. సుమారు 1500 మంది ఈ వేడుకలో ఆడిపాడి సరికొత్త record సృష్టించారు.
కొవిడ్ నిబంధనలను పాటిస్తూనే europeలోనే అతిపెద్ద బతుకమ్మ వేడుకను నిర్వహించి తెలంగాణ ఎన్నారై ఫోరమ్ రికార్డు తిరగరాసింది. దుర్గా పూజతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి భారత్ నుంచి తెచ్చిన జమ్మి చెట్టును పూజించి బతుకమ్మ ఆట, కట్టె కోలాటం ఇతర సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించారు.
అక్టోబర్ 10 మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు బతుకమ్మ, కట్టె కోలాటం ఆడి, నిమ్మజ్జనం చేశారు. అనంతరం అందరికీ విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి లండన్ డిప్యూటీ మేయర్ రాజేష్ అగర్వాల్, లండన్ ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా, స్థానిక మేయర్ బిష్ణులు హాజరై మాట్లాడారు.
ఈ కార్యక్రమ ముఖ్య అతిథి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ, భారత దేశ సంస్కృతిని చాటడం, కళలను ప్రోత్సహించడాన్ని అభినందించారు. ప్రకృతిని పూజించడాన్ని కొనియాడారు. భారత సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ఎన్నారైల పై ఉందని లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ అన్నారు.
వేల మంది ఒకచోట కలిసి పండుగ చేసుకోవడం అరుదు అని, బతుకమ్మ పండుగలో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలని మరో ఎంపీ సీమా మల్హోత్రా తెలిపారు. హిందూ పండుగలు నిర్వహించడం, సంప్రదాయాలను సజీవంగా ఉంచడంపై స్థానిక మేయర్ బిష్ణు సంతోషించారు.
సిద్దపేట గొల్లభామ, చేనేత, ఫిలిగ్రీ, పెంబర్తి ఇత్తడి, నిర్మల్ బొమ్మలను వివిధ దేశాల్లో ప్రచారం చేస్తున్నామని అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ అన్నారు. ఈ యేడు మళ్లీ అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి చరిత్ర తిరగరాసిన ఘనత తెలంగాణ ఎన్నారై ఫోరమ్ సభ్యులదేనని ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ చెప్పారు.