చేప మందు పంపిణీ: బత్తిన హరినాథ్ గౌడ్ కన్నుమూత
చేప మందు పంపిణీ ప్రసాదం చేసే బత్తిని హరినాథ్ గౌడ్ ఇవాళ కన్నుమూశారు. మృగశిర కార్తె రోజున హైద్రాబాద్ లో ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు చేపమందు పంణిణీ చేస్తారు.
హైదరాబాద్: మృగశిరకార్తె ప్రారంభం రోజున ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు చేప మందును పంపిణీ చేసే బత్తిన హరినాథ్ గౌడ్ గురువారంనాడు ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 84 ఏళ్లు. కొంత కాలంగా బత్తిన హరినాథ్ గౌడ్ అనారోగ్యంతో ఉన్నారు.హైద్రాబాద్ భోలక్‌పూర్ పద్మశాలీ కాలనీలో హరినాథ్ గౌడ్ నివాసం ఉంటున్నారు.
హైద్రాబాద్ లో చేపమందు అంటే బత్తిని హరినాథ్ గౌడ్ పేరు విన్పిస్తుంది. ఏళ్ల నుండి హైద్రాబాద్ లో మృగశిర కార్తె రోజున ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తిన హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు చేపమందును పంపిణీ చేస్తున్నారు. తరతరాలుగా బత్తిని హరినాథ్ గౌడ్ కుటుంబం ఈ మందును పంపిణీ చేస్తుంది. ఈ మందు కోసం మృగశిర కార్తె రోజున హైద్రాబాద్ కు వేలాది మంది వస్తారు. చేప మందు కోసం వచ్చే వారికి ఉచితంగా మందును సరఫరా చేస్తారు.
ఇవాళ తెల్లవారుజామున బత్తిన హరినాథ్ గౌడ్ అనారోగ్యంతో తన నివాసంలో మృతి చెందారు. ఇటీవల మృగశిరకార్తెను పురస్కరించుకొని చేపమందు పంపిణీలో బత్తిన హరినాథ్ గౌడ్ పాల్గొన్నారు.హరినాథ్ గౌడ్ కు భార్య, నలుగురు పిల్లలు. వీరిలో ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. బత్తిని హరినాథ్ గౌడ్ కు ఐదుగురు సోదరులున్నారు.
బత్తిన హరినాథ్ గౌడ్ పూర్వీకులు ఈ చేప మందును ప్రతి ఏటా ఉబ్బస వ్యాధిగ్రస్తులకు ఉచితంగా అందిస్తున్నారు. హరినాథ్ గౌడ్ పూర్వీకులైన వీరన్నగౌడ్ కు ఓ సాధువు ఉబ్బసానికి వనమూలికలతో తయారు చేసే మందు గురించి వివరించారు. ఈ మందును రోగులకు ఉచితంగా బత్తిన హరినాథ్ గౌడ్ కుటుంబం అందిస్తుంది. 176 ఏళ్ల నుండి చేప మందు పంపిణీ సాగుతుంది.బత్తిన హరినాథ్ గౌడ్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. బత్తిన హరినాథ్ గౌడ్ అంత్యక్రియలను ఇవాళ సాయంత్రం లేదా రేపు నిర్వహించనున్నారు.