బాసర  ట్రిపుల్  ఐటీలో  లైంగిక  వేధింపులు కలకలం  చోటు  చేసుకుంది. ఇద్దరు ఉద్యోగులపై  విద్యార్ధిని  ఫిర్యాదు  చేసింది. ఇద్దరు  ఉద్యోగులకు  చెందిన  ఫోన్లను  అధికారులు  సీజ్  చేశారు.  ఈ ఘటనపై  విచారణకు  కమిటీని  ఏర్పాటు చేశారు  ట్రిపుల్  ఐటీ డైరెక్టర్ సతీష్.

నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం చోటు చేసుకుంది. ఇద్దరు ఉద్యోగులపై విద్యార్ధిని ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీష్ విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది. ఇద్దరు ఉద్యోగులకు చెందిన ఫోన్లను విచారణ కమిటీ స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఏబీఎన్ కథనం ప్రసారం చేసింది.

ఇద్దరు ఉద్యోగులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఓ విద్యార్ధిని బాసర ట్రిపుట్ ఐటీ ఉన్నతాధికారులకు గురువారంనాడు ఫిర్యాదు చేసింది. అకౌంట్ సెక్షన్ లోని అధికారితో పాటు కిందిస్థాయి ఉద్యోగి తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆ విద్యార్ధిని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరిని వర్శిటీ అధికారులు విచారించారు. ఫిర్యాదు చేసిన విద్యార్ధిని తనకు బంధువు అవుతుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒకరు చెప్పారు. అయితే బాధిత విద్యార్ధిని తమకు బంధువు కాదని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి భార్య తేల్చి చెప్పారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరి ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. అంతేకాదు వారిద్దరి ఫోన్లను కూడా సీజ్ చేసి విచారణ నిర్వహిస్తున్నారు.ఈ విషయమై విచారణకు కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టుగా ఈ కథనం తెలిపింది. ట్రిపుల్ ఐటీ కాలేజీ నుండి విద్యార్ధిని బయటకు వెళ్లేందుకు ఔట్ పాసులు జారీ చేసే విషయమై ఏర్పడిన పరిచయం కారణంగా మరో అధికారి వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్ధిని ఆరోపించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న డైరెక్టర్ సతీష్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

ఏదో ఒక అంశంతో బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ అంశం మీడియాలో ప్రధాన అంశంగా మారుతుంది. ఇటీవల వరకు సమస్యలకు సంబంధించి విద్యార్ధులు ఆందోళన చేయడంతో బాసర ట్రిపుల్ వార్తల్లోకెక్కింది. విద్యార్ధుల సమస్యలను ప్రభుత్వం దశలవారీగా పరిశీలించనున్నట్టుగా ప్రకటించింది.ఈ మేరకు ఈ సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టింది. గత మాసంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే.