Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ మహిళలందరూ కేసీఆర్‌కు తోబుట్టువులే..: పోచారం

తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికి  ముఖ్యమంత్రి కెసిఆర్ తోడబుట్టువులుగా భావిస్తున్నారని... వారికోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని మాజీ  మంత్రి,బాన్సువాడ ఎమ్మెల్యే పొచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. చీర విలువ ముఖ్యం కాదు... పండుగకు పుట్టింటికి వచ్చిన సోదరికి చీర పెట్టి గౌరవించడం మన సాంప్రదాయమని అన్నారు. అలా పండగ సందర్భంగా చీరలను అందిస్తున్న కేసీఆర్ ను ఆడపడుచులు తమ అన్నలాగా భావిస్తున్నారని పోచారం కొనియాడారు. 
 

banswada mla pocharam srinivas praises kcr
Author
Banswada, First Published Dec 19, 2018, 4:41 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికి  ముఖ్యమంత్రి కెసిఆర్ తోడబుట్టువులుగా భావిస్తున్నారని... వారికోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని మాజీ  మంత్రి,బాన్సువాడ ఎమ్మెల్యే పొచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. చీర విలువ ముఖ్యం కాదు... పండుగకు పుట్టింటికి వచ్చిన సోదరికి చీర పెట్టి గౌరవించడం మన సాంప్రదాయమని అన్నారు. అలా పండగ సందర్భంగా చీరలను అందిస్తున్న కేసీఆర్ ను ఆడపడుచులు తమ అన్నలాగా భావిస్తున్నారని పోచారం కొనియాడారు. 

ఇవాళ బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పొచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల నిబంధనల కారణంగా బతుకమ్మ పండుగ సమయంలో మహిళలకు చీరలను పంపిణీ చేయలేక పోయామన్నారు. వచ్చే ఏడాది నుండి బతుకమ్మ పండుగకు ముందే చీరలను మహిళలకు అందిస్తామని హామీ ఇచ్చారు. 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7,75,650 మంది మహిళలకు, రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇలా చీరలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. బతుకమ్మ లాగానే రంజాన్, క్రిస్మస్ పండుగలకు కూడా ఆయా వర్గాల వారికి బట్టలను ప్రభుత్వం తరపున అందిస్తామని తెలిపారు. 

 ఎన్నికలు ముగిసాయి కాబట్టి ఇక రాష్ట్ర అభివృద్ధి పైనే దృష్టి పెడతామని పోచారం పేర్కొన్నారు. తమ మేనిపెస్టోలో వృద్దాప్య పెన్షన్ వయస్సును 57 ఏళ్ళకు తగ్గించనున్నట్లు వెల్లడించారు. గ్రామాల వారిగా సర్వే చేసి అర్హుల జాబితాను రూపొందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారన్నారు. ఈ పెన్షన్ కూడా రూ. 1000 నుండి రూ. 2016 కు పెరుగుతుందని పోచారం వివరించారు.

  కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని...ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నిజాంసాగర్ కు తీసుకువచ్చి వచ్చే వర్షాకాలం నుండి ఏటా రెండు పంటలకు సాగునీరందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కాళేశ్వరం ద్వారా రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం కానుందని పోచారం పేర్కొన్నారు.

బాన్సువాడలో మహిళలు, గర్భిణీల కోసం ప్రత్యేకంగా రూ. 20 కోట్లతో మాతా శిశు ఆసుపత్రిని నిర్మించనున్నట్లు పోచారం తెలిపారు. గతంలోనే రూ. 70 లక్షలతో బ్లడ్ బ్యాంకును, రూ. 40 లక్షలతో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన గుర్తు చేశారు.  

మిషన్ భగీరధ ద్వారా శుభ్రమైన మంచినీటిని ఇంటింటికి సరఫరా చేస్తున్నామని... తద్వారా ప్రజలకు నీటితో వచ్చే అనారోగ్య సమస్యలు దూరమవుతాయన్నారు. మార్చి 31, 2019 నాటికి రాష్ట్రంలో మిషన్ భగీరధ పథకం పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారని..ఆ దిశగా వేగంగా పనులు జరుగుతున్నాయని పోచారం తెలిపారు.

ఇక రైతుబంధు పథకం ద్వారా వచ్చే వానాకాలం నుండి రైతులకు ఎకరాకు రూ. 5,000 అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలను అందిపుచ్చుకొని రైతులు అప్పుల ఊబి నుండి బయటపడాలని సూచించారు. తెలంగాణ రైతులు  దేశంలోనే ధనిక రైతులుగా మారాలని కోరుకుంటున్నానని పోచారం వెల్లడించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios