తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దొంగతనం మరువకముందే...జగిత్యాలలో మరో బ్యాంకులో అలర్ట్ అలారం మోగింది. దీంతో హై అలర్ట్ అయ్యారు.
జగిత్యాల : జగిత్యాల పట్టణంలో అర్థరాత్రి హై అలర్ట్ మోగింది. పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ ముందు మంచాల రామేశం కాంప్లెక్స్ లో ఉన్న IDBI Bank నుండి అకస్మాత్తుగా అలారం సైరన్ మోగింది. దీంతో సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు అలెర్ట్ అయ్యారు., కేవలం 10 నిమిషాల్లోనే పట్టణ ASI వేణు తమ టీమ్ తో బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. బ్యాంక్ వద్ద తనిఖీలు నిర్వహించారు. అయితే, అక్కడ ఎటువంటి అలికిడి లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.
