Asianet News TeluguAsianet News Telugu

బండ్ల గణేష్ షాకింగ్ డెసిషన్

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హోదా కూడా ఇచ్చారు. 

bandla ganesh quits from politics
Author
Hyderabad, First Published Apr 5, 2019, 9:36 AM IST

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హోదా కూడా ఇచ్చారు. అయితే.. అనూహ్యంగా ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా తాను చేసిన విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టినవారిని పెద్ద మనసుతో క్షమించమని బండ్ల గణేష్‌ కోరారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఐఏసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత‍్తమ్‌ కుమార్‌ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదని బండ్ల గణేష్‌ తెలిపారు.

అయితే.. బండ్ల గణేష్ చేసిన అతి వల్లే అతనిని పార్టీ దూరం పెట్టినట్లు వివరించారు. అయితే బండ్ల గణేష్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్‌ చేయడం వెనుక మరేదో... వ్యూహం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పవన్‌ కల్యాణ్‌పై చేసిన ట్వీట్‌ అందుకు బలం చేకూరుస్తోంది. 

‘నిజాయితీకి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు....నా దైవం, నా బాస్..పవన్ కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని నా ప్రగాఢమైన కోరిక. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి అంటూ’ బండ్ల గణేష్‌ గురువారం ట్వీట్‌ చేశారు. దీంతో బండ్ల గణేష్‌ గాలి....జనసేనకు మళ్లిందేమో అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios