బండ్ల గణేష్ మరోసారి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? తాజాగా, బండ్ల గణేష్ చేసిన పొలిటికల్ ట్వీట్‌తో ఈ చర్చ మొదలైంది. తాను రాజకీయాల్లో లేరని అంటూనే జై కాంగ్రెస్ జైజై కాంగ్రెస్ అంటూ భట్టి పాదయాత్రను ఉద్దేశించి ఈ రోజు ట్వీట్ చేశారు. 

హైదరాబాద్: సినీ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి పొలిటికల్‌గా యాక్టివేట్ అవుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన పొలిటికల్ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. తాను రాజకీయాల్లో లేనని ఆయన ఇది వరకే స్పష్టం చేశారు. కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి, పార్టీ అధికారంలోకి రావడం గురించి ట్వీట్ చేయడం గమనార్హం. 

మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మార్చి 16వ తేదీ నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి పాదయాత్ర చేస్తున్నారు. ఆయన పాదయాత్ర 102 రోజులకు చేరింది. ప్రస్తుతం సూర్యపేట జిల్లాలో ఈ పీపల్స్ మార్చ్ పాదయాత్ర సాగుతున్నది. ఈ పాదయాత్ర గురించి, మల్లు భట్టి విక్రమార్క గురించి బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

Also Read: ఢిల్లీలోనే ఈటల, రాజగోపాల్‌రెడ్డి.. నేటి జేపీ నడ్డా ప్రసంగంపై ఫోకస్

భట్టి విక్రమార్కను ఉద్దేశిస్తూ.. అన్నా.. వస్తున్నా! అడుగులో అడుగేస్తా.. చేతిలో చేయేస్తా అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం, ఆ పార్టీ అధికారం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం అన్ని వదిలీ చేస్తున్న పాదయాత్రలో తానూ పాలుపంచుకుంటానని బండ్ల గణేష్ తెలిపారు. భట్టిని కలవడానికి సూర్యపేటకు వెళ్లుతున్నట్టు కామెంట్ చేశారు. అంతే కాదు.. జై కాంగ్రెస్ జైజై కాంగ్రెస్ అంటూ ట్వీట్ ముగించారు.