తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన రేపు బీజేపీ ముఖ్య నేతలను కలవనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ.. బండి సంజయ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన రేపు బీజేపీ ముఖ్య నేతలను కలవనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ.. బండి సంజయ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ ముఖ్య నాయకులు.. బండి సంజయ్‌ను సూచనలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ఉన్నారు. ఈ సమయంలో బండి సంజయ్ బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. 

ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకన్న బీజేపీ అధిష్టానం గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా.. రాష్ట్రంలోని పార్టీ ముఖ్య నాయకులు అంతా మునుగోడు ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఢిల్లీ నుంచి బీజేపీ ముఖ్య నేతలు మునుగోడు ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై కూడా బండి సంజయ్‌.. బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది.