Asianet News TeluguAsianet News Telugu

ప్రజా సంగ్రామ యాత్రలో ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు.. కుంటిసాకులతో ఆపేందుకు కుట్ర: బండి సంజయ్

ప్రజా సంగ్రామ యాత్రను కుంటిసాకులతో ఆపేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. యాత్రలో తాను ఎక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ప్రజలకు భరోసా కల్పించాల్సిన సీఎం ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని విమర్శించారు.

bandi Sanjay Slams TRS Govt For stop his ongoing padayatra
Author
First Published Aug 24, 2022, 2:09 PM IST

ప్రజా సంగ్రామ యాత్రను కుంటిసాకులతో ఆపేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. యాత్రలో తాను ఎక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ప్రజలకు భరోసా కల్పించాల్సిన సీఎం ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని విమర్శించారు. ప్రజలకు అండగా ఉండేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్టుగా తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్ర ఏ ఒక్క వ్యక్తికి వ్యతిరేకం కాదని అన్నారు. కుటుంబ పాలన ప్రమాదకరం అనేందుకు కేసీఆర్ పాలనే నిదర్శనం అని ఆరోపించారు. అక్రమ అరెస్టులు, దాడులు, నిర్బంధాలపై బీజేపీ నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసన దీక్షకు దిగింది. అయితే ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న బండి సంజయ్.. కరీంనగర్‌లోని ఆయన దీక్షకు దిగారు. దీక్ష ముగిసన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. 

కవితపై వచ్చిన ఆరోపణల దృష్టి మళ్లించేందుకు తన యాత్రను అడ్డుకున్నారని బండి సంజయ్ విమర్శించారు.  ఎక్కడ ఐటీ, ఈడీ దాడులు జరిగిన కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లే వినిపిస్తున్నాయని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కు ప్రకారమే ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టినట్టుగా చెప్పారు. ప్రజాసంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తే లేదన్నారు. యాత్రలో ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. ఈ నెల 27న హన్మకొండలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఉంటుందని తెలిపారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ప్రజలు తరలిరావాలని కోరారు. 

ఇక, బండి సంజయ్ బుధవారం ఉదయం కరీంనగర్‌లో మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం బయటపడుతుందనే తన పాదయాత్రను అడ్డుకున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌తో కవితకు సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. కవితపై లిక్కర్ స్కామ్‌ ఆరోపణలై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 27న హన్మకొండలో ప్రజా సంగ్రా యాత్ర ముగింపు సభ ఉంటుందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభలో పాల్గొంటారని.. ఈ సభను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 

ఇక,  ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలన్న పోలీసుల నోటీసులపై బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు ప్రజా సంగ్రామ యాత్ర కొసాగించేందుకు అనుమతులు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. కోర్టు నుంచి అనుమతి వస్తే.. బండి సంజయ్ కరీంనగర్ నుంచి నేరుగా జనగామ వెళ్లనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios