తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్(డీహెచ్) శ్రీనివాసరావుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయను ఆధ్వర్యంలోని వైద్య శాఖను చూసుకునే తెలివి కూడా శ్రీనివాసరావుకు లేదని విమర్శించారు.
తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్(డీహెచ్) శ్రీనివాసరావుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయను ఆధ్వర్యంలోని వైద్య శాఖను చూసుకునే తెలివి కూడా శ్రీనివాసరావుకు లేదని విమర్శించారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న మహిళలు అస్వస్థతకు గురయ్యారని.. హాస్పిటల్స్‌లో సరైన సౌకర్యాలు కల్పించలేకపోయారని మండిపడ్డారు ఎమ్మెల్యే టికెట్ కోసం శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కాళ్లు మొక్కుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఆయన పెద్ద అవినీతి పరుడు అని విమర్శించారు.
‘‘ప్రజల ఆరోగ్యం గురించి చూసుకోవాల్సిన వ్యక్తి.. ఒక మత సభలలోకి పోయి కరోనా నుంచి ఆ దేవుడు కాపాడాడని అంటున్నాడు. ఆ దేవుడు ఉన్న దేశాలు అభివృద్ది చెందితే.. శ్రీనివాసరావు ఇక్కడేందుకు ఉంటున్నాడు?.. మరి ఆ దేవుడు ఉన్న దేశానికే పోయి బుతుకు’’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. శ్రీనివాసరావుది ఒక బతుకేనా?, ప్రభుత్వ అధికారి అయి ఒక మతానికి కొమ్ముకాయడానికి ఆయనకు సిగ్గుందా? అని ప్రశ్నించారు. శ్రీనివాసరావు వంటి వ్యక్తులు పుట్టడం వల్లే ఈ దేశం అవమానాలకు గురవుతుందని అన్నారు.
ఇక, డీహెచ్ శ్రీనివాసరావు ఇటీవలికాలంలో వరుసగా వివాదాలకు కేంద్ర బిందుకు మారుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న డీహెచ్ శ్రీనివాసరావు.. కోవిడ్ -19ను జీసస్ నిర్మూలించాడని అన్నారు. మానవ మనుగడకు క్రైస్తవ మతమే అభివృద్దిని నేర్పిందన్నారు. ‘‘మనం కోవిడ్ -19ను ప్రభువైన యేసుక్రీస్తు ఆశీర్వాదం, దయ వల్లనే ఓడించగలిగాం’’ అని చెప్పారు.
