కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బద్నాం చేస్తున్నారని టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ అధికారులతో అవాస్తవాలు చెప్పిస్తున్నారని ఆరోపించారు. మీటర్లు పెడితే బడా బాబుల ఫామ్‌హౌస్‌లో విద్యుత్ అక్రమాలు వెలుగుచూస్తాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బద్నాం చేస్తున్నారని టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. బొగ్గు దిగుమతి అంశంలో కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ అధికారులతో అవాస్తవాలు చెప్పిస్తున్నారని ఆరోపించారు. సోమవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది చాలా పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. బినామీ వ్యక్తులతో భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను నడిపిస్తున్నారని విమర్శించారు. బినామీ వ్యక్తులతో పెట్టుబడులు పెట్టించి.. కమిషన్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లతో కుమ్మకై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నారని విమర్శించారు.
పాతబస్తీలో విద్యుత్ చార్జీలు వసూలు చేయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ప్రత్యేకంగా సబ్ స్టేషన్ పెట్టుకున్నారని విమర్శించారు. ఫామ్ హౌస్‌లో వందల ఎకరాలకు ఉచిత కరెంట్ వాడుకుంటున్నారని ఆరోపించారు. మీటర్లు పెడితే బడా బాబుల ఫామ్‌హౌస్‌లో విద్యుత్ అక్రమాలు వెలుగుచూస్తాయని అన్నారు. మీటర్లపై టీఆర్‌ఎస్ నేతలు కావాలనే రైతులు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
డిస్కంలను ప్రభుత్వం నష్టాల్లో ముంచిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. రూ. 3 కొనే కరెంట్‌ను తెలంగాణ ప్రభుత్వం రూ. 6కు కొనుగోలు చేస్తుందని విమర్శించారు. కమీషన్ల కోసమే అధిక ధరలకు విద్యుత్ కొనుగోల చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విడిచారని విమర్శించారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ అబద్దాలతో కాలం గడిపేస్తున్నారని మండిపడ్డారు. అడ్డగోలు అప్పులతో రాష్ట్రం దివాళా తీయిస్తున్నారని విమర్శించారు.
