Asianet News TeluguAsianet News Telugu

హిందూ దేవుళ్ళను కించపరిస్తే ఊరుకోం.. ధర్మం కోసం ఎంతకైనా సిద్దమే: బండి సంజయ్

హిందూ దేవుళ్ళను కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకోం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హిందూ ధర్మాన్ని కించపరిచే హబ్‌గా రాష్ట్రం మారిందని ఆరోపించారు.

Bandi Sanjay Slams KCR and Telangana Government
Author
First Published Dec 31, 2022, 4:26 PM IST

హిందూ దేవుళ్ళను కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకోం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హిందూ ధర్మాన్ని కించపరిచే హబ్‌గా రాష్ట్రం మారిందని ఆరోపించారు. శనివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. అయ్యప్పను కించపరిచే విధంగా కొందరు మాట్లాడుతున్నారని.. ఇది దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. నాస్తికులని పేరు పెట్టుకుని కేవంత హిందూ దేవుళ్లను ఎందుకు కించపరుస్తున్నారని ప్రశ్నించారు. హిందువులు ఏదైనా మాట్లాడితే పీడీ యాక్ట్‌‌లు పెడుతారని.. హిందూ దేవుళ్ళను కించపరిచిన వాళ్ళపై మాత్రం చర్యలు ఉండవని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రోద్బలంతోనే.. రాష్ట్రంలో హిందువులను హేళన చేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. 

నాస్తిక సమాజం పేరుతో ఇష్టమొచ్చినట్టుగా మాత్రమే సహించేది లేదన్నారు. హిందూ దేవుళ్ళను కించపరిచే విధంగా మాట్లాడితే ఉరికించి కొడుతామని హెచ్చరించారు. అవసరమైతే జైలుకు వెళతామని.. ధర్మం కోసం ఎంతకైనా సిద్దమేనని చెప్పారు. కేటీఆర్ దేవుళ్ళు అంటే నమ్మకం ఉండదని బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణలో హిందువులు ఆవేశంతో రగిలిపోతున్నారని అన్నారు. ఎప్పుడు ఏదైనా జరగవచ్చని చెప్పుకొచ్చారు. హిందు దేవుళ్లను కించపరిచే విధంగా మాట్లాడటంతో వారి రక్తం మరిగిపోతుందని అన్నారు. 

ఏ రాజకీయ పార్టీలో ఉన్నవారైనా  హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోవద్దని చెప్పారు.  ‘‘మన కల్చర్ ను మనమే కాపాడుకోవాలి. సంఘటితంగా ఉంటేనే హిందూ ధర్మాన్ని కాపాడుకోగలం. బడిత పూజ చేయండి. నాకెందుకని ఊరుకోకండి’’ అని బండి సంజయ్ చెప్పారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై సీఎం కేసీఆర్ కఠిన చర్యలు తీసుకోవాలని.. లేకుంటే హిందూ సమాజం క్షమించదని అన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios