గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే దళితబంధు ప్రకటంచారని ఆరోపించారు. ప్రభుత్వం మెడలు వంచైనా సెప్టెంబర్ 17ను నిర్వహిచేలా చేస్తామని స్పష్టం చేశారు.
సంగారెడ్డి : టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మీద బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఓ తుగ్లక్ పార్టీ, ఎంఐఎం ఓ తాలిబాన్ పార్టీ అంటూ ధ్వజమెత్తారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే దళితబంధు ప్రకటంచారని ఆరోపించారు. ప్రభుత్వం మెడలు వంచైనా సెప్టెంబర్ 17ను నిర్వహిచేలా చేస్తామని స్పష్టం చేశారు.
కేంద్రం రూ. లక్షల కోట్ల నిధులు రాష్ట్రానికి ఇస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మీద టీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సచివాలయానికి రాని సీఎం కేసీఆర్ కు కొత్త సచివాలం ఎందుకు? అని సంజయ్ ప్రశ్నించారు.
కాగా, బుధవారం నాడు టీఆర్ఎస్ నేతలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొందరు వారి గ్లామర్ కాపాడుకోవడానికి డ్రగ్స్ వాడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే వారికి రక్త పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
తన భాషను అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారని... భాష విషయంలో కేసీఆరే తన గురువని బండి సంజయ్ అన్నారు. బీజేపీతో తప్ప అన్ని పార్టీలతో కలిసి టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిందని ఆయన ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కెప్టెన్ అయితే, ఒవైసీ వైస్ కెప్టెన్ అని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్స్ ట్రా ప్లేయర్లు అని ఆయన సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం కేసీఆర్ కు వచ్చిందని... అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్లాడని సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి వేసినట్టేనని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు
