కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ నిధులు ఇస్తున్నారు..: బండి సంజయ్
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును సీఎం కేసీఆర్ భర్తిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును సీఎం కేసీఆర్ భర్తిస్తున్నారని ఆరోపించారు. బలహీనమైన బీఆర్‌ఎస్ నాయకులపై కాంగ్రెస్‌కు చెందిన 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ నిధులు ఇస్తున్నారని బండి సంజయ్ అన్నారు. అందుకే ఆ అభ్యర్థులు గెలిచిన కూడా బీఆర్ఎస్‌లోకే వెళ్తారని ఆరోపించారు. కేసీఆర్ పాలనతో రాష్ట్రంలో యువత, రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. శుక్రవారం సిరిసిల్లలో బీజేపీ అబ్యర్థి హరీష్‌బాబు, సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమారెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ పాల్గొన్నారు.
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీక్‌ను అరికట్టడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమవడంతో 50 లక్షల మంది నిరుద్యోగ యువకులు తీరని కష్టాలు ఎదుర్కొంటున్నారని సంజయ్ ఆరోపించారు. అవినీతి నేతలే బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల సీఎం అభ్యర్థులని సంజయ్ ఆరోపించారు. బీజేపీకి అవకాశం ఇస్తే అవినీతి ఆరోపణలు లేని పేద నాయకుడు ముఖ్యమంత్రి అవుతారని బండి సంజయ్ అన్నారు.
కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే ఉద్యోగులకు మూడు నెలలకోసారి జీతాలు ఇస్తారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఇటీవల ఆయన ఫామ్‌హౌస్‌లో రాజశ్యామల యాగం చేయలేదని.. వశీకరణ పూజలు చేశారని ఆరోపించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు సీఎం కావాలా?.. బీసీ నేత సీఎం కావాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో కుర్చీ కోసం కొట్లాటలు జరుగుతున్నాయని అన్నారు.