Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నారు.. ఫామ్‌హౌస్‌లో నల్లపిల్లితో పూజలు.. అందుకే పార్టీ పేరు మార్పు: బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసమే టీఆర్ఎస్ పేరును  మార్చారని విమర్శించారు. కేసీఆర్ చాలా రోజులుగా తాంత్రిక పూజలు చేస్తున్నారని ఆరోపించారు. 

bandi sanjay Sensational Comments On CM KCR
Author
First Published Oct 8, 2022, 4:11 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసమే టీఆర్ఎస్ పేరును  మార్చారని అన్నారు. కేసీఆర్ చాలా రోజులుగా తాంత్రిక పూజలు చేస్తున్నారని ఆరోపించారు. తాంత్రికుడి సూచనతోనే పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మార్చారని విమర్శించారు. మూడు నెలలకోకసారి నల్లపిల్లితో పూజలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లిన తాంత్రికుడి అనుమతి తీసుకుంటారని అన్నారు. దేశంలో సచివాలయానికి వెళ్లని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. తాంత్రికుడి మాటలు విని కొత్త సచివాలయ భవనం నిర్మిస్తున్నారని ఆరోపించారు. 

‘‘తాంత్రికుడు చెప్పాడనే కేసీఆర్ సచివాలయానికి వెళ్లలేదు. తాంత్రికుడు చెప్పాడనే సచివాలయాన్ని కూలగొట్టి.. కొత్త సచివాలయం కడుతున్నాడు. ఫామ్ హౌస్‌లో తాంత్రిక పూజలు చేసి.. ఆ ద్రవ్యాలను కాళేశ్వరంలో కలిపారు. మూడు నెలలకు ఒకసారి ఫామ్‌హౌస్‌లో నల్లపిల్లితో పూజలు చేస్తున్నారు. ముగ్గురు వర్కర్స్ చనిపోయారు. ఒక యువకుడు చనిపోయిండు.. అప్పుడే బలి కావొచ్చని ప్రచారం జరిగింది. చివరకు స్వార్దం కోసం, కుటుంబం కోసం తాంత్రిక పూజలు చేసిన తర్వాతనే.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చారు. దేశం, రాష్ట్ర బాగుండాలని కాదని.. తిరిగి అధికారంలో రావడం కోసం ఇదంతా చేస్తున్నారు’’ అని బండి సంజయ్ ఆరోపించారు. 

రాక్షసుడు చేసే దెయ్యాల పూజలు కేసీఆర్ చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తాము దేవుడిని నమ్ముతామని, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతామని చెప్పారు. కేసీఆర్ కుట్రలను తెలంగాణ సమాజాం అర్థం చేసుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ తాంత్రిక పూజల నుంచి తెలంగాణను, రాష్ట్ర ప్రజలను అర్చకులను, స్వామిజీలను కోరుతున్నానని  చెప్పారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందా? లేదా? అనేది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, మజ్లీస్ కలిసి ప్రజలను ఇబ్బందుకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. ఎంఐఎం పార్టీ చట్టాలను గౌరవించడం లేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ది కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని అన్నారు. మునుగోడు రాజగోపాల్ రెడ్డి భారీ మెజారిటీ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios