సారాంశం

Bandi Sanjay: అధికార బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ మరోసారి  విరుచుకపడ్డారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఆ రెండు పార్టీలు విధ్వంసం స్రుష్టించాలని భావిస్తున్నానని సంచలన ఆరోపణలు చేశారు.  

Bandi Sanjay: బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ మరోసారి అధికార బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై మరోసారి విరుచుకపడ్డారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఆ రెండు పార్టీలు విధ్వంసం స్రుష్టించాలని భావిస్తున్నానని ఆరోపించారు.  మతపరమైన ఊరేగింపులో పాల్గొన్న కొందరు యువకులు సంజయ్ నివాసం, అతని కార్యాలయంపై శుక్రవారం దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేయగా .. ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులను ప్రశ్నించారు.  

బీజేపీ కరీంనగర్‌ పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయిన్‌పల్లి ప్రవీణ్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.  అయితే.. ఆత్మరక్షణ కోసం యత్నించిన బీజేపీ నేతలపై ఉల్టా కేసులు పెట్టడం సరికాదని అన్నారు. తమ సహనాన్ని చేతగాని తనంగా భావిస్తే.. పరిణామాలు దారుణంగా ఉంటాయని అన్నారు.  

ఇదే సమయంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.  తామే నిజమైన దేశభక్తులమని.. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము చెప్పినట్టే నడవాలంటూ అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. 

వాళ్లు పాకిస్తాన్‌కు దేశభక్తులా? ఆఫ్గనిస్తాన్‌కా? అంటూ ప్రశ్నించారు. ఎంఐఎం నేతలు నిజంగా దేశభక్తులే అయితే.. భాగ్యలక్ష్మి గుడికి వచ్చి జనగణమణ, వందేమాతరం గీతాలను పాడాలంటూ.. సవాలు  చేశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్ లు విధ్వంసం సృష్టించాలని అనుకుంటున్నాయని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం  పార్టీని దేశద్రోహ పార్టీ అని మండిపడ్డారు.