తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. పే స్కేల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి KCRకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ bandi sanjay బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో పంచాయతీ కార్యదర్శులకు pay scale అమలు చేయడంతోపాటు వారి సర్వీస్ ను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమైనదని ఆయన అన్నారు. పారిశుద్ధ్యం, హరితహారం, పన్నుల సేకరణ మొదలు దోమల నివారణ దాకా పంచాయతీ కార్యదర్శుల సేవలు మరువలేనివని ఆయన అన్నారు.
పంచాయతీ కార్యదర్శులపై నిత్యం అధికార పార్టీ గూండాల దాడులు చేయడం బాధాకరమని, ఉన్నతాధికారుల వేధింపులు పంచాయతీ కార్యదర్శులపై నిత్యకృత్యంగా మారడం దారుణమన్నారు. పంచాయతీ కార్యదర్శుల్లో మనోధైర్యం నింపి ఉద్యోగ భరోసా కల్పించాల్సిన భార్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. కచ్చితమైన పని గంటల నిర్ణయించడంతో పాటు వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, పిబ్రవరి 14న బండిసంజయ్ మాట్లాడుతూ.. నెక్స్ట్ PCC చీఫ్ కేసీఆరేనని BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay విమర్శించారు. ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ KCR పై మండిపడ్డారు.Pragathi Bhavan భవన్ నుండి కేసీఆర్ Gandhi Bhavan కు మారబోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. టెన్ జన్‌పథ్ నుండి కేసీఆర్ కు స్క్రిప్ట్స్ వస్తున్నాయన్నారు. ఈ స్క్రిప్ట్ మేరకే కేసీఆర్ మాట్లాడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. న్యాయ వ్యవస్థతో పాటు ప్రధాని, ఇతర వ్యవస్థలపై కేసీఆర్ కు నమ్మకం లేదన్నారు. Rafale scam విషయంలో సుప్రీంకోర్టు తీర్పును కేసీఆర్ ధిక్కరిస్తున్నారన్నారు. ఈ విషయమై నోరు జారితే రాఫెల్ రెక్కలకు కేసీఆర్ ను కడుతామని ఆయన మండి పడ్డారు.
ఆదివారం నాడు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. సర్టికల్ స్ట్రైక్స్ పై ఆధారాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర మంత్రులు బీజేపీ నేతలు కేసీఆర్ పై ఎదురు దాడికి దిగుతున్నారు.ఇవాళ మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతుంటే చూస్తే గానీ కేసీఆర్ కు నమ్మకం కలగదేమో అని సంజయ్ సెటైర్లు వేశారు.తమపై దాడి జరిగిందని పాకిస్తాన్ కూడా ప్రకటించినా కేసీఆర్ నమ్మడా అని బండి సంజయ్ ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్స్ పై వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ను క్షమించొద్దన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు సైనికుల ఆత్మ స్త్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.కేసీఆర్ వ్యాఖ్యలపై దేశ భక్తులంతా బాధపడుతున్నారన్నారు.
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి అక్రమాలు జరగలేదని Supreme Court తీర్పు ఇచ్చిందని బండి సంజయ్ గుర్తు చేశారు. Raffile యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని విమర్శలు చేస్తే సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం పాల్జేయడమేనన్నారు.సర్టికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత దేశమంతా సంబరాలు జరుపుకొందని ఆయన గుర్తు చేశారు. జవాన్ల త్యాగాన్లను కించపరిచేలా మాట్లాడడం దేశ ద్రోహమే అవుతుందని బండి సంజయ్ చెప్పారు.