జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ‘బస్తీ నిద్ర’ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ కార్యకర్తలకు, నేతలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ బస్తీ నిద్రకు  అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు పిలుపునిచ్చారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ఇంఛార్జీలతో సోమవారం ఉధయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన  బండి సంజయ్  ‘బస్తీ నిద్ర’ ప్రాధాన్యతను వివరించారు. 
ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో తనతోపాటు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు వీలైనంత మేరకు ‘బస్తీ నిద్ర’ చేస్తామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా రేపు తాను ‘బస్తీ నిద్ర’ చేస్తానని ప్రకటించారు. బస్తీ నిద్ర’ కార్యక్రమంలో సామాన్యులు నివసించే ప్రాంతాల్లోనే నిద్ర చేయాలని, బస్తీల్లో ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుని వారితో మమేకం కావాలని కోరారు. 

బీజేపీ కార్పొరేటర్లు గెలిచిన తరువాత కూడా ‘బస్తీ నిద్ర’ కార్యక్రమాన్ని వారానికి ఒక రోజు నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి క్రుషి చేస్తారనే విషయాన్ని‘బీజేపీ బస్తీ నిద్ర’ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరారు.