హామీలను నెరవేర్చాలని కోరితే దాడులా?: గౌరవెల్లి నిర్వాసితులపై లాఠీచార్జీపై గవర్నర్ కు బండి సంజయ్ ఫిర్యాదు

తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే గౌరవెల్లి భూ నిర్వాసితులపై విచక్షణరహితంగా పోలీసులు లాఠీచార్జీ చేయించడాన్ని బీజేపీ తప్పు బట్టింది.ఈ విషయమై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు ఫిర్యాదు చేశామని బండి సంజయ్ చెప్పారు. గౌరవెల్లి భూ నిర్వాసితులతో కలిసి బండి సంజయ్ గవర్నర్ తో భేటీ అయ్యారు. 

Bandi Sanjay Complaints Against KCR Government loty charge Over Gouravelli Reservoir oustees

హైదరాబాద్: తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరితే G ouravelli project భూ నిర్వాసితులపై విచక్షణరహితంగా పోలీసులతో ప్రభుత్వం  లాఠీచార్జీ చేయించిందని  BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay  ఆరోపించారు. మహిళలు, యువతుల పట్ల పోలీసులు అసభ్యంగా వ్యవహరించారన్నారు.మహిళల పట్ల రాక్షసంగా వ్యవహరించి రాక్షసానందం పొందుతున్నాడని KCR  పై బండి సంజయ్ మండిపడ్డారు. 

గౌరవెల్లి భూనిర్వాసితులతో కలిసి బుధవారంనాడు తెలంగాణ గవర్నర్ Tamilisai Soundararajan  తో బండి సంజయ్ భేటీ అయ్యారు. గౌరవెల్లి భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జీపై  బండి సంజయ్ పిర్యాదు చేశారు. ఈ భేటీ ముగిసిన తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.12 ఏళ్లుగా గౌరవెల్లి రిజర్వాయర్ భూ నిర్వాసితులు పోరాటం చేస్తున్నారని ఆయన చెప్పారు. 2009లో Congress ప్రభుత్వం 1.9 టీఎంసీలతో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణానికి పూనుకొందన్నారు  ఆ తర్వాత  జరిగిన  కేసీఆర్ సర్కార్ ఈ రిజర్వాయర్ కెపాసిటీని 8 టీఎంసీలకు పెంచిందన్నారు. సుమారు 80 వేల ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు.

18 ఏళ్లు దాటిన యువతీ యువకులకు రూ. 8 లక్షలు, వృద్దులకు కూడా ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని  ఆయన గుర్తు చేశారు . నిర్వాసితులకు Double Bedroom  ఇళ్లుు నిర్మిస్తామని కూడా కేసీఆర్  హామీ ఇచ్చారన్నారు. ఈ హామీలను పరిష్కరించాలని కోరితే పోలీసులతో లాఠీ చార్జీ చేయించారని బండి సంజయ్ విమర్శించారు. గౌరవెల్లి రిజర్వాయర్ లో నీళ్లకు బదులుగా భూ నిర్వాసితుల రక్తాన్ని పారిస్తున్నారని ఆయన విమర్శించారు.

also read:గవర్నర్‌తో గౌరవెల్లి భూ నిర్వాసితుల భేటీ: నిర్వాసితులకు బీజేపీ అండ

మిడ్ మానేర్, మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఇంకా పరిహారం చెల్లించలేదని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలోని రైతులను ఆదుకోకుండా పంజాబ్ రాష్ట్రంలో రైతులకు రూ. 3 లక్ష చొప్పున ఆర్ధిక సహాయం చేయడాన్ని సంజయ్ తప్పు బట్టారు. రూ. 250 కోట్లతో కేసీఆర్ దేశ వ్యాప్తంగా అడ్వర్ టైజ్ మెంట్స్ వేసుకున్నారని సంజయ్ చెప్పారు. ప్రజల పన్నులతో వచ్చిన డబ్బులను తన ప్రచారం కోసం కేసీఆర్ ఉపయోగించుకొన్నారన్నారు.ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలతో కేసీఆర్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో గద్దె దిగడం ఖాయమన్నారు.  

మూడు రోజులుగా గౌరవెల్లి భూ నిర్వాసితులు ఆందోళనలు చేస్తున్నారు. ఆదివారం నాడు రాత్రి గుడాటిపల్లి వాసులసై పోలీసులు లాఠీచార్జీ చేశారు. సపోలీసుల సహాయంతో అధికారులు సర్వే పనులు నిర్వహించారు. ఈ పనులను అడ్డుకొంటారని తమపై దాడి చేసి సర్వే పనులు చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 

సర్పంచ్ లను వేధిస్తున్న సర్కార్: బండి సంజయ్

గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించని ప్రభుత్వం మరోసారి పనులు చేయాలని వేధింపులకు గురి చేస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. బలవంతంగా పనులు చేయిస్తున్నారన్నారు.  ఒక్కొక్క సర్పంచ్ కు రూ. 2 నుండి రూ. 30 లక్షలు బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు.  కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తన స్వంతానికి వాడుకుంటుందని ఆయన ఆరోపించారు.ఈ విషయమై కూడా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు ఫిర్యాదు చేసినట్టుగా ఆయన చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios