Asianet News TeluguAsianet News Telugu

‘నా భాషకు గురువు కేసీఆరే..’ ఆయన గద్దె దిగేదాకా ఇలాగే మాట్లాడతా.. బండి సంజయ్

రైతులకు, బియ్యానికి ఏం సంబంధం? రైతులు అమ్మేది వడ్లు అన్నారు. రైతులు ఎవరు భయపడొద్దని.. పండించిన ప్రతీ గింజను కెసిఆర్ చేత కొనిపిస్తాం అని...కేంద్రంతో కొన్నిచ్చే బాధ్యత నాది అన్నారు.

bandi sanjay comments on telangana chief minister kcr
Author
Hyderabad, First Published Sep 28, 2021, 4:42 PM IST

వరి వేస్తే ఉరి అని చెబుతున్న కేసీఆర్‌(KCR)కు వరి కొనమని ఎవరు చెప్పారు? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)ప్రశ్నించారు.  పండించిన ప్రతి గింజ కొంటామన్న కేసీఆర్.. ఇప్పుడు నెపాన్ని కేంద్రంపై నెడుతున్నారని మండిపడ్డారు. రైతులను భయపెడుతున్న కెసిఆర్ ఐదుగురు రైతుల మృతికి కారణమని చెప్పుకొచ్చారు. 

రైతులకు, బియ్యానికి ఏం సంబంధం? రైతులు అమ్మేది వడ్లు అన్నారు. రైతులు ఎవరు భయపడొద్దని.. పండించిన ప్రతీ గింజను కెసిఆర్ చేత కొనిపిస్తాం అని...కేంద్రంతో కొన్నిచ్చే బాధ్యత నాది అన్నారు. రాష్ట్రంలో  నకిలీ విత్తనాలు అమ్మేది కెసిఆర్ సన్నిహితులేనని పేర్కొన్నారు. కెసిఆర్ ఒక్క రైతుబంధు ఇచ్చి మిగితావన్ని బంద్ చేశారని చెప్పారు. 

గులాబ్ ఎఫెక్ట్: పొంగిపొర్లుతున్న మూసీ... చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై రాకపోకల నిలిపివేత, భారీగా ట్రాఫిక్ జాం

తోటపల్లి రిజర్వాయర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వడం లేదన్నారు. నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వని కేసీఆర్ తన కుటుంబంలో నలుగురికి ఇచ్చుకున్నడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతికి  దిక్కులేదని, ఉద్యోగులకు జీతాలు లేవన్నారు.  

ఆనాడు ఉద్యమం కోసం ఆత్మహత్యలు చేసుకుంటే.. ఈ రోజు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.  నా భాషకు గురువు కెసిఆరే.  కెసిఆర్ ను గద్దె దించేదాక భాష మార్చుకోనని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios