తెలుగు రాష్ట్రాల బిజెపి మాజీ అధ్యక్షులు బండి సంజయ్, సోము వీర్రాజు లకు ఆ పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. బిజెపి జాతీయ కార్యవర్గంలో వీరిద్దరికి చోటు కల్పించారు.
హైదరాబాద్ : తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతల నుండి తొలగించిన బండి సంజయ్ కు అదిష్టానం మరో కీలక బాధ్యతల అప్పగించింది. బిజెపి జాతీయ కార్యవర్గంలో సంజయ్ కు చోటు కల్పించారు. ఈ మేరకు బిజెపి జాతీయాధ్యక్షుడు జేపి నడ్డా పేరిట ఓ ప్రకటన వెలువడింది.
ఇటీవలే పలు రాష్ట్రాల అధ్యక్షులను బిజెపి అదిష్టానం తొలగించింది. ఇలా తెలుగు రాష్ట్రాలను చెందిన బిజెపి అధ్యక్షులను కూడా తొలగించారు. ఇలా అధ్యక్ష పదవుల నుండి తొలగించివారికి జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించింది బిజెపి. తెలంగాణ,ఏపి బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, సోము వీర్రాజుకు జాతీయ కార్యవర్గంలో చోటుదక్కింది.
శనివారం రాత్రి 10మందిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటున్నట్లు బిజెపి ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలతో పాటు హిమాచల్ ప్రదేశ్, బిహార్, పంజాబ్,జార్ఖండ్, రాజస్థాన్ మాజీ అధ్యక్షులు బండి సంజయ్, సోమువీర్రాజు, సురేష్ కశ్యప్, సంజయ్ జైశ్వాల్, అశ్మిని శర్మ, దీపక్ ప్రకాశ్,సతీష్ పూనియా చోటుదక్కింది. ఇక చత్తీస్ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ నాయకులు విష్ణుదేవ్ సాయి, ధరమ్ లాల్ కౌశిక్, కిరోడిలాల్ మీనా లకు కూడా బిజెపి జాతీయ కార్యవర్గంలో చోటుదక్కింది.
Read More తెలంగాణ యువకుడి ప్రతిభకు మెచ్చి... భుజం తట్టి గుండెలకు హత్తుకున్న ప్రధాని మోదీ
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు ఇటీవలే మారిన విషయం తెలిసిందే. ఇలా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరిని అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ క్రమంలోనే అధ్యక్ష పదవులు కోల్పోయిన బండి సంజయ్, సోము వీర్రాజుకు బిజెపి జాతీయ కార్యవర్గంలో చోటుదక్కింది.
ఇక ఇటీవలే తెలంగాణ బిజెపి నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. అలాగే మరో నేత ఈటల రాజేందర్ ను ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా నియమించారు. ఇలా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి నాయకులకు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగిస్తోంది.
