Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 13 న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం : తలసాని శ్రీనివాస్ యాదవ్

ఈ నెల 13 న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 

Balkampet Yellamma Kalyanam on July 13 : Talasani Srinivas Yadav - bsb
Author
Hyderabad, First Published Jul 6, 2021, 4:20 PM IST

ఈ నెల 13 న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 

కల్యాణానికి సంబంధించి జూలై 12 న ఎదుర్కోళ్ళు, 13 న కళ్యాణం, 14 న రధోత్సవం ఉంటుందని తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నిర్వహణ, ఏర్పాట్ల పై ఆలయం ఆవరణలో మంత్రి  శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో జోనల్ కమిషనర్ ప్రావిణ్య, కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, R & B SE పద్మనాభరావు, ఆలయ EO అన్నపూర్ణ, కల్చరల్ డైరెక్టర్ హరికృష్ణ, వాటర్ వర్క్స్ GM ప్రభు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన తులాభారాన్ని ప్రారంభించారు.అమ్మవారి కళ్యాణానికి తరలివచ్చే లక్షలాది మంది భక్తులు  అసౌకర్యానికి గురికాకుండా ముఖ్యమంత్రి KCR ఆదేశాల మేరకు  అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు 

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం  నిర్వహణ కోసం ప్రభుత్వం 10 లక్షల రూపాయలు మంజూరు చేసిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కళ్యాణం రోజున ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తామని తెలిపారు.

ఆలయ పరిసరాలలో భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాపిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. అయితే ఈ ఉత్సవం సందర్భంగా నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
ప్రత్యేక హెల్త్ క్యాంప్ లు, క్యూ లైన్ లలో వచ్చే భక్తులకు మంచినీటిని అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios