ఢిల్లీ: చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో బాల్క సుమాన్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. అయితే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గులాబీ దళపతి సీఎం కేసీఆర్ బాల్క సుమన్ ను అసెంబ్లీ బరిలో దించారు. 

చెన్నూరు టిక్కెట్ ను బాల్క సుమన్ కు కేటాయించారు. చెన్నూరు అసెంబ్లి నియోజకవర్గం నుంచి బాల్క సుమన్ పోటీచేసి గెలుపొందారు. దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు అందజేశారు. 

తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా బాల్క సుమన్ కోరారు. తాను చెన్నురు ఎన్నికైనట్లు చెప్పడంతో స్పీకర్ సుమిత్రా మహజన్ అభినందనలు తెలిపారు. రాజీనామా సమర్పించిన సమయంలో బాల్క సుమన్ వెంట ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, బూర నర్సయ్య గౌడ్, నగేష్, వేణుగోపాలాచారిలు ఉన్నారు.