బాగా పేరున్న హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డూ ధర  ఈ సారి రికార్డు స్థాయికి చేరుకుంది. లడ్డును కొద్ది సేపటికిందట వేలం వేశారు.  గతేడాది కంటే రూ.95వేలు అధికంగా అమ్ముడుపోయింది. వేలం పాటలో  రూ.15లక్షల 65వేలకు అయ్యప్ప సొసైటీకి చెందిన నాగం తిరుపతిరెడ్డి దక్కించుకున్నారు. 10:23 గంటలకు ఈ వేలం మొదలయింది.  వేలం ధర పోటీలో  రూ.15లక్షల 60వేలకు చేరింది. ఈ సారి లడ్డూను సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తిరుపతి రెడ్డి అన్నారు. బాలాపూర్ లడ్డూను జీవితంలో ఒక్కసారైనా దక్కించుకోవాలని ఎప్పట్నుంచో తాను అనుకుంటున్నానని చెప్పారు. ఆ కల ఇప్పటికి నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. 

ఇది లడ్డూ వేలం చరిత్ర.

1994లో రూ. 450, 1995లో రూ.4,500

1996లో రూ.18 వేలు,1997లో రూ. 28వేలు

1998లో రూ. 51వేలు, 1999లో రూ. 65వేలు

2000లో రూ.66 వేలు, 2001లో రూ. 85వేలు

2002లో రూ. 1.05లక్షలు 2003లో రూ. 1.55లక్షలు

2004లో రూ. 2.01లక్షలు, 2005లో రూ. 2.08లక్షలు

2006లో రూ. 3లక్షలు, 2007లో రూ. 4.15లక్షలు

2008లో రూ. 5.07లక్షలు, 2009లో రూ. 5.10లక్షలు

2010లో రూ. 5.35లక్షలు, 2011లో రూ. 5.45లక్షలు

2012లో రూ. 7.50లక్షలు, 2013లో రూ. 9.26 లక్షలు

2014లో రూ.9.50లక్షలు, 2015లో రూ.10.32లక్షలు

2016లో రూ.14లక్షల 65వేలు

2017లో రికార్డు స్థాయిలో రూ.15లక్షల 60వేలు