పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి బాలయ్య ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా.. బాలయ్య సినిమా డైలాగులతో రెచ్చిపోతున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే... ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 43మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనలో  యావత్ ప్రపంచం.. పాక్ పై మండిపడుతోంది.

దేశప్రజలైతే.. తమకు తోచిన విధానంలో పాక్ పై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో నిరసన తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని భారీగా టార్గెట్ చేశారు. భయంకరంగా భూతులు తిడుతూ.. ఇమ్రాన్ ఖాన్ కి సోషల్ మీడియాలో మెసేజ్ లు పెడుతున్నారు. అలా మెసేజ్ లు చేసిన వారిలో ఎక్కువ మంది తెలుగువారు ఉండటం గమనార్హం.

వారిలో.. కొందరు బాలయ్య అభిమానులు ఉండటం విశేషం. ఓ బాలయ్య అభిమాని ఇమ్రాన్ ఖాన్ ఇన్‌స్టాగ్రాం అకౌంట్ కామెంట్ సెక్షన్‌లో పెట్టిన పోస్ట్ ఏంటంటే.. ‘మీ దేశాన్ని ముగించడానికి బాలయ్య బాబు చాలు.. బాంబులతో కాదు రా కంటి చూపుతో చంపేస్తాడు’. ఇలా పాక్‌పై తన కోపాన్ని బాలకృష్ణ డైలాగ్ రూపంలో ఓ అభిమాని వ్యక్తం చేశాడు.
 
మరో హైదరాబాదీ స్పందిస్తూ.. ‘ఫేస్‌ టూ ఫేస్ రా.. మా సోల్జర్స్ మార్చింగ్‌కే నీకు హార్ట్ అటాక్ వస్తది’ అని కామెంట్ చేశాడు. పాక్ డిఫెన్స్ బడ్జెట్ కంటే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ మూవీ పార్కింగ్ కలెక్షన్స్ ఎక్కువ అని మరో హైదరాబాదీ ట్వీట్ చేశారు.