పది నెలల కుమారుడు భవిత్ ను తల్లి చంకలో ఎత్తుకొని ఇంట్లో ఆడిస్తున్నారు. కిటికీలో ఉన్న ఆటబొమ్మలను చిన్నారికి అందించేందుకు తల్లి కిటికీ వద్దకు వెళ్లారు. 

తల్లి చంకలో ఉన్న ఓ చిన్నారిని పాము కాటేసింది. దీంతో.. ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని ముంపు గ్రామం లక్ష్మణాపురానికి చెందిన బాణావత్ గణేశ్-దివ్య దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం. ఆదివారం సాయంత్రం తమ పది నెలల కుమారుడు భవిత్ ను తల్లి చంకలో ఎత్తుకొని ఇంట్లో ఆడిస్తున్నారు. కిటికీలో ఉన్న ఆటబొమ్మలను చిన్నారికి అందించేందుకు తల్లి కిటికీ వద్దకు వెళ్లారు.

ఇంటి లోపల గోడలకు ప్లాస్టరింగ్ చేయకపోవడంతో అప్పటికే ఇటుకల మధ్యలో దూరి ఉన్న తాచుపాము చిన్నారి కాలుపై కాటు వేసింది. బాబు ఉలికిపాటును గమనించిన తల్లి అటువైపు తిరిగేలోపే మళ్లీ కాటేసింది. ఈ హఠాత్పరిమాణానికి భీతిల్లిన తల్లి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి చిన్నారిని ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా.. మార్గమధ్యలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

కాగా.. ఆ పాముని మాత్రం కాపుకాచి మరీ.. పాములు పట్టే వ్యక్తిని రప్పించి.. పాముని స్థానికులు బంధించారు.