ఖైరతాబాద్‌లో నాలాలో కొట్టుకొచ్చిన మొసలి.. జనం పరుగులు
హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ చింతల్‌బస్తీలో మొసలి పిల్ల కలకలం రేపింది. బల్కాపూర్ నాలా వద్ద వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో మొసలి పిల్ల ప్రత్యక్షమైంది.

హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ చింతల్‌బస్తీలో మొసలి పిల్ల కలకలం రేపింది. నగరంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నాలాలు పొంగిపొర్లాయ. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై డ్రైనేజీ నీరు చేరుకుంది. ఈ క్రమంలోనే బల్కాపూర్ నాలా వద్ద వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో మొసలి పిల్ల ప్రత్యక్షమైంది. దీనిని చూడగానే స్థానికులు భయంతో పరుగులు తీశారు. అనంతరం జీహెచ్ఎంసీ , అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.