2005 నాటి బాబ్లీ కేసును (babli case) నాంపల్లి  కోర్టు (nampally court) కొట్టేసింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత కేసు కొట్టేసింది న్యాయస్థానం. దీంతో టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు (chandrababu naidu)  సహా 23 మంది నేతలకు ఊరట కలిగినట్లయ్యింది.  

2005 నాటి బాబ్లీ కేసును (babli case) నాంపల్లి కోర్టు (nampally court) కొట్టేసింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత కేసు కొట్టేసింది న్యాయస్థానం. దీంతో టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు (chandrababu naidu) సహా 23 మంది నేతలకు ఊరట కలిగినట్లయ్యింది. 

బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నారంటూ ఆరోపించిన చంద్ర‌బాబు అందుకు నిర‌స‌న‌గా ప్రాజెక్టు వ‌ద్దే ధ‌ర్నా చేయాల‌ని నిర్ణ‌యించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2005లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సీఎంగా ఉండ‌గా టీడీపీ నేత‌ల‌తో క‌లిసి చంద్ర‌బాబు బాబ్లీ ప్రాజెక్టు వ‌ద్ద‌కు చేరుకున్నారు. అయితే అక్క‌డ ధ‌ర్నాకు అనుమ‌తి లేద‌ని పోలీసులు టీడీపీ నేత‌ల‌ను అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఇరువ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఎట్ట‌కేల‌కు చంద్ర‌బాబు స‌హా టీడీపీ నేత‌ల‌ను అక్క‌డే ఓ గ‌దిలో పోలీసులు నిర్బంధించారు. అంతేకాకుండా చంద్ర‌బాబు స‌హా 23 మంది టీడీపీ నేత‌ల‌పై కేసులు న‌మోదు చేశారు.

ఈ కేసులో విచార‌ణ‌ను చేప‌ట్టిన నాంప‌ల్లి కోర్టు.. ప‌లు ద‌ఫాలుగా కేసును విచారించింది. కేసు విచార‌ణ అలా కొన‌సాగుతుండ‌గానే.. 17 ఏళ్ల స‌మ‌యం గ‌డిచిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. నాడు చంద్ర‌బాబుతో క‌లిసి బాబ్లీ వ‌ద్ద ధ‌ర్నాకు య‌త్నించిన చాలా మంది టీడీపీ నేత‌లు ఆ త‌ర్వాత ఇత‌ర పార్టీల్లోకి చేరిపోయారు. తెలంగాణ‌కు చెందిన నేత‌లంతా ఇప్పుడు టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఈ కేసు విచార‌ణ నేపథ్యంలో మంగ‌ళ‌వారం నాంప‌ల్లి కోర్టుకు నేత‌లు వ‌చ్చారు. కేసును విచారించిన న్యాయస్థానం కేసును కొట్టివేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది.