తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో కలకలం రేగింది. అసీఫ్‌నగర్‌‌‌కు చెందిన తోఫిక్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 

తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో కలకలం రేగింది. అసీఫ్‌నగర్‌‌‌కు చెందిన తోఫిక్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం చాదర్‌ఘాట్ సమీపంలో అతను నడుపుతున్న సమయంలో ఓ బస్సు అతని ఆటోని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో అతని గొంతుకు గాయమైంది. వెంటనే చాదర్‌ఘాట్ పోలీసులు తోఫీక్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న సమయంలో ఆటోడ్రైవర్‌కు, వార్డ్ బాయ్‌కి వాగ్వివాదం చోటు చేసుకుంది.

ఈ విషయంపై అతడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేయాలనుకున్నాడు. అందుకోసం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయానికి వచ్చాడు.. ఈ సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతనిని అడ్డుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు.