ఇద్దరితో కాపురం చేస్తూనే మైనర్ బాలికతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఓ ఆటో డ్రైవర్. ఇద్దరు భార్యలకు తెలియకుండానే మైనర్ బాలికతో సంబంధం కొనసాగించాడు ప్రబుద్దుడు.
ఇద్దరితో కాపురం చేస్తూనే మైనర్ బాలికతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఓ ఆటో డ్రైవర్. ఇద్దరు భార్యలకు తెలియకుండానే మైనర్ బాలికతో సంబంధం కొనసాగించాడు ప్రబుద్దుడు.పెళ్లి చేసుకోవాలని అడిగిన పాపానికి మైనర్ బాలికను మంజీరా నదిలో తోసేసి ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకొంది.
మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం సోమ్లాతండాకు చెందిన ఓ బాలిక కేజీబీవీ స్కూల్ లో 9వ తరగతి చదువింది. గత ఏడాది ఎల్లుపేట ఉన్నత పాఠశాలలో పదోతరగతిలో చేరింది.ఎల్లుపేటకు చెందిన ఓ ఆటోడ్రైవర్ కు ఆ బాలికకు పరిచయమైంది. ప్రతి రోజూ ఆటోలో బాలికను ఉచితంగా స్కూల్ నుండి ఇంటికి తీసుకొచ్చేవాడు. అంతేకాదు ఆ బాలికను ప్రేమలోకి దించాడు.
ఆటో డ్రైవర్ కు అల్లాదుర్గం గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. అయితే ఆమె అనుమానాస్పదస్థితిలో మరణించింది. దీంతో న్యాల్ కల్ మండలం ఇబ్రహీంపూర్ కు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకొన్నాడు.
మైనర్ బాలికతో ప్రేమాయణం కొనసాగించిన ఆటో డ్రైవర్ హైద్రాబాద్ వట్టినాగులపల్లిలో కాపురం పెట్టాడు. కొంత కాలం తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆ బాలిక నిందితుడిని కోరింది.
దీంతో పెళ్లి చేసకొంటానని బాలికను నమ్మించి హత్య చేశాడు. పాపన్నపేట మండలం గాజులగూడం శివారులోకి తీసుకెళ్లి మంజీరా నది బ్రిడ్జిపై నుండి బాలికను తోసేశాడు.ఈ ఘటన గత ఏడాది అక్టోబర్ 31న (2020, అక్టోబర్ 31) చోటు చేసుకొంది.
బాలిక మృతదేహాన్ని ఎవరు గుర్తించకపోవడంతో పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు.బాలిక తల్లిదండ్రులు గత ఏడాది నవంబర్ మాసంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆటో డ్రైవర్ పై ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడి కాల్ డేటాను పరిశీలించారు.
అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో నిందితుడు అసలు విషయాన్ని వెల్లడించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.
