Asianet News TeluguAsianet News Telugu

బేగంపేట్ ఆడిటర్ కిడ్నాప్ కేసు : భార్యకు చెప్పకుండా.. బంధువులతో సొంతూరికి.. !!

హైదరాబాద్, బేగంపేట్ లో ఆడిటర్ కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యింది. అతను సొంత ఊర్లో ఉన్నానని వీడియో కాల్ చేయడంతో ఈ కేసులో కుటుంబసభ్యులతో సహా, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

auditor sambasiva rao kidnap in begumpet, solved - bsb
Author
Hyderabad, First Published Jun 29, 2021, 11:01 AM IST

హైదరాబాద్, బేగంపేట్ లో ఆడిటర్ కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యింది. అతను సొంత ఊర్లో ఉన్నానని వీడియో కాల్ చేయడంతో ఈ కేసులో కుటుంబసభ్యులతో సహా, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

వివరాల్లోకి వెడితే.. బేగంపేట్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కిడ్నాప్ కలకలం పోలీసులకు ఉరుకులు, పరుగులు పెట్టించింది. ఆడిటర్ కిడ్నాప్ కు గురయ్యాడని పోలీసులకు అందిన ఫిర్యాదు వారిని హైరానా పెట్టింది. చివరికి అతను క్షేమంగా ఉన్నట్లు వీడియోకాల్ ద్వారా తెలపడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

మణికొండకు చెందిన సాంబశివరావు ఆడిటర్ గా పనిచేస్తున్నాడు. ప్రతీరోజు సికింద్రాబాద్, భరణీ కాంప్లెక్స్ లోని తన కార్యాలయానికి వెళ్లేవాడు. ఆదివారం ఆఫీసుకు వెళ్లిన సాంబశివరావు రాత్రికి ఇంటికి రాలేదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారిని ఆరా తీసినా ప్రయోజనం కనిపించలేదు. 

టెక్కీ భువనేశ్వరి హత్య: భర్త అరెస్టు, సీసీటీవీలో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు...

అయితే బేగంపేట ప్రకాష్ నగర్ లోని సాంబశివరావు బంధువు ఇంటి దగ్గర అతని కారు ఉన్నట్లు తెలిసిది. అతనికి భారీగా అప్పులు ఉన్న నేపథ్యంలో దగ్గరి బంధువులే కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానంతో అతడి భార్య సరిత బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అందుబాటులోకి వచ్చిన సాంబశివరావు ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ రావుతో వీడియోకాల్ లో మాట్లాడాడు. తాను క్షేమంగా ఉన్నానని, బంధువులతో తన స్వస్థలమైన ఖమ్మం జిల్లా, సత్తుపల్లికి వచ్చినట్లు చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios