తెలంగాణలో రెండో రోజు ప్రత్యక్ష తరగతుల హాజరు శాతం పెరిగింది. మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు స్కూళ్లకు హాజరైన విద్యార్ధుల సంఖ్య పెరిగింది. రెండో రోజు స్కూళ్లలో హాజరు శాతం 28.12 వున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో రెండో రోజు ప్రత్యక్ష తరగతుల హాజరు శాతం పెరిగింది. మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు స్కూళ్లకు హాజరైన విద్యార్ధుల సంఖ్య పెరిగింది. రెండో రోజు స్కూళ్లలో హాజరు శాతం 28.12 వున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మొదటి రోజు 21.77 హాజరు నమోదైంది. ఇక ఇవాళ కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎక్కువ హాజరు కనిపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం.. 38.82 వుండగా.. ఎయిడెడ్ పాఠశాలల్లో ఇది 15.04గా వుంది. ఇక ప్రైవేట్ స్కూళ్లలో 21.74 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తల్లిదండ్రుల్లో వున్న అపోహలను తొలగిస్తున్నారు టీచర్లు.
