ఫోన్ సంభాషణలో మాటమాట పెరిగి తలెత్తిన వివాదం కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు.

టీఆర్ఎస్ నేత నందకిషోర్ వ్యాస్ కుమారుడు, అతని సోదరుడి కుమారుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఫోన్ సంభాషణలో మాటమాట పెరిగి తలెత్తిన వివాదం కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారిద్దికీ ఉస్మానియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆస్పత్రికి తరలించారు. గోషామహల్‌ ఏసీపీ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నందకిషోర్‌వ్యాస్‌ కుమారుడు ప్రేమ్‌బిలాల్‌ వ్యాస్‌.

అతని సోదరుడు అమిత్‌వ్యాస్‌ స్నేహితుడు సోలంకీ... అమిత్‌వ్యాస్‌కు ఫోన్‌ చేయగా ప్రేమ్‌బిలాల్‌ ఎత్తాడు. అయితే సోలంకీ అసభ్య పదజాలంతో దూషించడంతో మాటామాటా పెరిగింది. ‘దమ్ముంటే బేగంపేట్‌కు రా’ అనడంతో ప్రేమ్, అమిత్ మరో ఇద్దరు స్నేహితులు అశీష్, నవజ్యోత్‌సింగ్‌ అక్కడికి వెళ్లారు. అప్పటికే అక్కడున్న సోలంకీ, ఆకాష్, దీపక్‌ వీరిపై కత్తితో దాడి చేశారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని ఏసీపీ చెప్పారు. నందకిషోర్‌వ్యాస్‌ను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులుపరామర్శించారు.