నెంబర్ 1 టివి జర్నలిస్టు పై దాడి తీవ్ర గాయాలపాలైన శివరామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు

తెలంగాణ జర్నలిస్టు పై దాడి జరిగింది. అర్థ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న జర్నలిస్టుపై కర్రలతో దాడి చేశారు కొందరు దుండగులు. వివరాలిలా ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో నివాసం ఉంటున్న నెంబర్ 1 టీవీ ఇన్ పుట్ ఎడిటర్ శివరామకృష్ణ పై హత్యాయత్నం జరిగింది.

రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వెల్ లో తన ఇంట్లో నిద్రిస్తున్న శివరామకృష్ణ పై అర్థరాత్రి కర్రలతో దాడి చేసి పారిపోయారు ఆగంతకులు. శివరామకృష్ణ తలకు తీవ్ర గాయాలయ్యాయి.

ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు.

దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి