Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ : 48 గంటలపాటు మద్యం దుకాణాలు బంద్.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు..

రేపటి పోలింగ్ దృష్ట్యా.. నియోజకవర్గాల్లోని మద్యం దుకాణాలు, బార్లను ఎక్సైజ్ శాఖ మూసేయించింది. 

Assembly election polling: Liquor shops closed for 48 hours - bsb
Author
First Published Nov 29, 2023, 12:33 PM IST

హైదరాబాద్ :  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ గురువారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనల ప్రకారం 48 గంటల పాటు మద్యం అమ్మకాలను నిషేధించారు. హైదరాబాదులోని కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో ఉన్న మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్లను  కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ సీఐ యాదయ్య మంగళవారం నాడు మూసేయించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ 48 గంటల పాటు ఈ దుకాణాలన్నీ మూసే ఉంటాయని తెలిపారు. 

వీటిని అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయిస్తే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.  నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios