తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌పై సిలికాన్ వ్యాలీకి చెందిన ఎంట్రప్రెన్యూర్‌, వెంచర్ క్యాపిటలిస్ట్ అశా జడేజా మోత్వాని ప్రశంసల వర్షం కురిపించారు. 20 ఏళ్ల తర్వాత కేటీఆర్ భారత ప్రధాన మంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. 

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌పై సిలికాన్ వ్యాలీకి చెందిన ఎంట్రప్రెన్యూర్‌, వెంచర్ క్యాపిటలిస్ట్ అశా జడేజా మోత్వాని ప్రశంసల వర్షం కురిపించారు. దావోస్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో సహా ఆయన బృందం.. విదేశీ కంపెనీలు, పెట్టుబడదారులకు వారి రాష్ట్రానికి గమ్యస్థానంగా మార్చేందుకు అద్భుతంగా కృషి చేస్తున్నారని చెప్పారు. 20 ఏళ్ల తర్వాత కేటీఆర్ భారత ప్రధాన మంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. ఇంత స్పష్టత, భావవ్యక్తీకరణ ఉన్న యువ రాజకీయ నాయకుడిని తానెప్పుడూ చూడలేదని చెప్పారు. ఈ మేరకు అశా జడేజా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దావోస్‌ కేటీఆర్ కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు. 

‘‘20 ఏళ్ల తర్వాత.. KTR భారతదేశానికి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోకండి. ఇంత స్పష్టత, భావవ్యక్తీకరణ ఉన్న యువ రాజకీయనాయకుడిని నేనెప్పుడూ చూడలేదు. దావోస్‌లో తెలంగాణ జట్టు ఫుల్ ఫైర్‌తో ముందుకు వెళ్తుంది. వారు నాకు సిలికాన్ వ్యాలీ స్టార్టప్ గురించి గుర్తు చేస్తున్నారు. భవిష్యత్తులో డీల్స్‌లో బిలియన్ డాలర్లు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది’’ అశా జడేజా ట్వీట్ చేశారు. 

ఇక, దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి కేటీఆర్.. తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా తన పర్యటనను సాగిస్తున్నారు. దావోస్ పర్యటనలో భాగంగా లైఫ్‌ సైన్సెస్ అభివృద్ధి, తీసుకువచ్చిన సంస్కరణలపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ వివరించారు. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడంలో భాగంగా.. పారిశ్రామికవేత్తలతో వరుసగా సమావేశమవుతున్నారు. 

Davos వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy, తెలంగాణ మంత్రి Kalvakuntla Tarakaramaravu ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ‘‘నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ గారితో గొప్ప సమావేశం జరిగింది’’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే వీళ్లిద్దరూ ఎంతసేపు భైటీ అయ్యారు, ఏయే అంశాలమీద చర్చించారనే దానిమీద స్పష్టత రావాల్సి ఉంది.