Asianet News TeluguAsianet News Telugu

ఆపెయ్యండి, పాకిస్థాన్ కి ఓవైసీ వార్నింగ్

పాకిస్థాన్ పై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌ విషయంలో జోక్యం చేసుకోవడం పాకిస్థాన్ ఆపివేయాలని  హెచ్చరించారు. జమ్మూకశ్మీర్‌, కశ్మీరీ యువత భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేశారు. 

asaduddin owaisi says kashmir will always be integral part India
Author
Hyderabad, First Published Jan 19, 2019, 9:35 PM IST

హైదరాబాద్: పాకిస్థాన్ పై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌ విషయంలో జోక్యం చేసుకోవడం పాకిస్థాన్ ఆపివేయాలని  హెచ్చరించారు. జమ్మూకశ్మీర్‌, కశ్మీరీ యువత భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేశారు. 

శనివారం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సులో పాల్గొన్న ఓవైసీ చాలా కాలంగా పాకిస్థాన్, ఐఎస్ఐ, ఆర్మీ సాయంతో కశ్మీర్ యువతను భారత్‌కు వ్యతిరేకంగా ఉసిగొల్పుతోందని మండిపడ్డారు. భారత సైన్యంపై రాళ్లదాడులకూ ప్రేరేపిస్తోందంటూ ధ్వజమెత్తారు. 

అంతేకాదు పీఓకేలో ఉగ్రవాద శిక్షణ ఇచ్చి మరీ సరిహద్దు దాటిస్తోంది. ఇటు భారత సైన్యం ఉగ్రవాదంపై కఠిన వైఖరి అనుసరిస్తూ ఉగ్రవాదులను ఏరిపారేస్తోందని కొనియాడారు. 
తన ప్రసంగాలు విద్వేషపూరితంగా ఉన్నాయంటే అవి నలుగురిలో ఆలోచనలు రేకెత్తించడానికే అని చెప్పుకొచ్చారు.

తన దృష్టిలో మహాత్మాగాంధీ కన్నా భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ గొప్పవారని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి యువత రావాలని ఒవైసీ పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చే యువత  జాతీయ పార్టీల్లో కాకుండా ప్రాంతీయ పార్టీల్లో చేరాలని సూచించారు. 

జాతీయ పార్టీలలో చేరితే ఉన్నత స్థానాలకు ఎదగలేరన్నారు. యువత ప్రాతినిధ్యం పెంచేందుకు ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులుగా పోటీచేసేందుకు కనీస వయసును 20 ఏళ్లకు తగ్గించాలని అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. తనకు 49 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా తనను యువ నాయకుడిగానే గుర్తిస్తున్నారంటూ చెప్పడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ జాగృతి కార్యక్రమంలో అసదుద్దీన్

Follow Us:
Download App:
  • android
  • ios