Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ బారిన ఆలయపూజారి.. మానవత్వం చాటుకున్న అసదుద్దీన్..

కరోనా బారినపడిన పూజారికి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉదారత చాటుకున్నారు. పాతబస్తీలోని ఓ ఆలయ పూజారి(75)కి గత శనివారం కరోనా నిర్ధారణ అయ్యింది. హోం ఐసొలేషన్ లో ఉంటున్నారు. గురువారం ఆయన అస్వస్థతకు గురికావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించడానికి కుటుంబీకులు యత్నించారు.

Asaduddin owaisi humanity over temple priest in old city - bsb
Author
Hyderabad, First Published Apr 23, 2021, 10:01 AM IST

పేదా, గొప్పా, చిన్నా, పెద్ద తేడా లేకుండా కరోనా అందర్నీ కాటేస్తుంది. ఈ సమయంలో కులం, మతం లాంటి భేదాలు లేకుండా మానవత్వమే మతంగా పరిమళిస్తున్న ఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటున్నాయి. అలాంటిదే ఓ ఘటన హైదరాబాద్ పాత బస్తీలో జరిగింది.

కరోనా బారినపడిన పూజారికి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉదారత చాటుకున్నారు. పాతబస్తీలోని ఓ ఆలయ పూజారి(75)కి గత శనివారం కరోనా నిర్ధారణ అయ్యింది. హోం ఐసొలేషన్ లో ఉంటున్నారు. గురువారం ఆయన అస్వస్థతకు గురికావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించడానికి కుటుంబీకులు యత్నించారు.

ఎక్కడా పడకలు అందుబాటులో లేకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. ఆ పూజారి కుటుంబీకులు ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరిస్థితిని వివరించారు. వెంటనే ఆయన శాలిబండ లోని ఓ ఆస్పత్రిలో బెడ్ ఏర్పాటు చేయించారు.

ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ లో గడచిన 24 గంటల్లో 1847 మంది కరోనా బారిన పడినట్టు ప్రభుత్వం ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది, మేడ్చల్ జిల్లా 421మంది, రంగారెడ్డి జిల్లాలో 437 మందికి తాజాగా పాజిటివ్ లు నిర్థారించారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios