హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించబోతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీపీ. 

తాము గతంలో దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డితో గెలిచామని ప్రస్తుతం వైయస్ జగన్ తో కూడా కలిసి నడుస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు తప్పిదాల వల్లే ఓటమి పాలయ్యారని విమర్శించారు. 

దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి కంటే వైయస్ జగన్ మెరుగైన పాలన అందిస్తారని తాను బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు. తాము వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తామని అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు.