Asianet News TeluguAsianet News Telugu

ప్రొఫెసర్ కాశీం పరారీలో ఉన్నారా..? పోలీసులకు న్యాయస్థానం అక్షింతలు

కాశీం అరెస్టుకి ముందు కనీసం నోటుసులైనా ఇచ్చారా అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. అరెస్టుపై ఓయూ అధికారులకు సమాచారం ఇచ్చి, వారి అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించారు. కేసు దర్యాప్తుకి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందని ప్రశ్నించింది. అసలు అరెస్ట్ చట్టబద్ధంగా చేశారా లేదా అనే విషయాలపై తమకు అనుమానం కలుగుతోందని .. ఈనెల 23వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Arrest of OU prof Kasim : HC directs police to file detailed counter
Author
Hyderabad, First Published Jan 20, 2020, 11:35 AM IST

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాశీం అరెస్టుపై న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. ప్రతి రోజూ యూనివర్శిటీకి వెళ్లి పాఠాలు చెబుతున్న ప్రొఫెసర్ పరారీలో ఉన్నారంటూ పోలీసులు చెప్పడంపై న్యాయస్థానం మండిపడింది. ఇటీవల కాశీంని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా.... ఆయనను న్యాయస్థానం ఎదుట నిలబెట్టారు.

అయితే... కాశీం అరెస్టు వ్యవహారంపై పోలీసులు వ్యవహరించిన తీరుపై న్యాయస్థానం మండిపడటం గమనార్హం. కాశీం అరెస్టుకి ముందు కనీసం నోటుసులైనా ఇచ్చారా అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. అరెస్టుపై ఓయూ అధికారులకు సమాచారం ఇచ్చి, వారి అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించారు. కేసు దర్యాప్తుకి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందని ప్రశ్నించింది. అసలు అరెస్ట్ చట్టబద్ధంగా చేశారా లేదా అనే విషయాలపై తమకు అనుమానం కలుగుతోందని .. ఈనెల 23వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Also Read ఓయూ ప్రోఫెసర్ కాశీం అరెస్ట్: విచారణ 23కు వాయిదా...

అయితే... ప్రొఫెసర్‌ కాశింను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, ఆయన ఆచూకీ తెలిపేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌ దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఆదివారం సీజే నివాసంలో మరోసారి విచారించింది.

సీజే నివాసంలో ఆదివారం దాదాపు మూడు గంటలపాటు విచారణ జరిగింది. మొదట కాశిం కుటుంబ నేపథ్యం, అరెస్టు ముందు పోలీసులు వ్యవహరించిన తీరుతోపాటు.. ఆయనపై ఉన్న కేసులను న్యాయస్థానం అడిగి తెలుసుకుంది.

కాగా... తనపై తప్పుడు సాక్ష్యాలు పోలీసులే సృష్టించి తనను అరెస్టు చేశారని.. బలవంతంగా తనచేత సంతకం చేయించారని ఈ సందర్భంగా కాశిం పేర్కొన్నారు. అదేవిధంగా తనకు సంగారెడ్డి జైల్లో సౌకర్యాలు సరిగాలేవని.. చర్లపల్లికి తరలించాలని కోరారు. ఆయన కోరిక పట్ల న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. 

ఇదిలా ఉంటే.. కాశీంకి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనడానికి తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో.. పూర్తి వివరాలతో ఈనెల 23వ తేదీలోగా కౌంటర్ దాఖలు  చేయాలని.. విచారణ ఈ నెల 24వ తేదీకు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.

కాశింకు బెయిలు కోసం సోమవారం పిటిషన్‌ దాఖలు చేస్తామని ఆయన తరపు న్యాయవాది రఘునాథ్‌ విలేకరులతో చెప్పారు. 2006లో నమోదు చేసిన కేసుతోపాటు మరో ఐదు కేసుల్లో కాశిం నిందితుడిగా ఉన్నట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పారని.. అవన్నీ కింది కోర్టుల్లో వీగిపోయినవేనని వివరించారు. 

కాగా... కాశిం అరెస్టుపై ఆమె తల్లి వీరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు కాశిం నిర్దోషి అని చెప్పారు.  ప్రొఫెసర్‌గా ఎంతో మంది విద్యార్థులకు పాఠాలు చెప్పిన మంచి గురువు తన కొడుకు అని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని.. తన ఉపన్యాసాలతో ప్రజలను జాగృతం చేశాడని గుర్తు చేశారు.  అదేనా నా బిడ్డ చేసిన తప్పు అంటూ ఆమె  ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడడమే కాశిం చేసిన నేరమా? అని కంటతడి పెట్టారు. తన కొడుకును విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios