ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చిక్కిన చైనాకు చెందిన వ్యక్తిని  ఆ దేశానికి చెందిన గూఢచారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ వ్యక్తికి హైద్రాబాద్‌తో లింకులు ఉన్నాయనే విషయమై పోలీసులు గుర్తించారు. 

హైదరాబాద్: ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చిక్కిన చైనాకు చెందిన వ్యక్తిని ఆ దేశానికి చెందిన గూఢచారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యక్తికి హైద్రాబాద్‌తో లింకులు ఉన్నాయనే విషయమై పోలీసులు గుర్తించారు. చైనాకు చెందిన హన్ జున్ వే ను బంగ్లాదేశ్ సరిహద్దులో బీఎస్ఎఫ్ సిబ్బంది అరెస్ట్ చేశారు. బెంగాల్ రాష్ట్రానికి మాల్దా జిల్లాలోని ఈ నెల 10వ తేదీన జున్‌వే ను బీఎస్ఎఫ్ సిబ్బంది అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా ఇండియాలోకి వస్తుండగా బీఎస్ఎఫ్ సిబ్బంది అరెస్ట్ చేశారు. 

చైనాకు చెందిన జున్‌వేకు హైద్రాబాద్ తో లింకులు ఉన్నట్టుగా బీఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. హైద్రాబాద్ లోని విశ్వ టెక్నాలజీ లిమిటెడ్ పేరుతో కంపెనీని నిర్వహించింది. పహాడీషరీఫ్ లో ఈ కంపెనీని నిర్వహించినట్టుగా గుర్తించారు. విశ్వ కంపెనీలో నలుగురు పెట్టుబడులు పెట్టారని గుర్తించారు. రజాక్, నబీ, ముస్తాక్, ప్రశాంత్‌కుమార్ లు పెట్టుబడులు పెట్టారని బీఎస్ఎఫ్ గుర్తించింది.

విదేశాల నుండి అక్రమంగా నిధులు వస్తున్నాయా అనే కోణంలో బీఎస్ఎఫ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 2010లో జున్ వే హైద్రాబాద్ కు వచ్చినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఇండియాకు నాలుగుసార్లు జున్ వే ఇండియాకు వచ్చినట్టుగా గుర్తించారు. 

గురుగ్రామ్ లో ఓ హోటల్‌ను ఆయన లీజుకు తీసుకొన్నారని సమాచారం. పదేళ్లు పాటు ఈ హోటల్‌ను నిర్వహించుకొనేందుకు ఒప్పందం కుదుర్చుకొన్నారు. నెలకు రూ. 10 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదిరిందని పోలీసులు గుర్తించారు. ముంబైలో రెండు కంపెనీలను జున్ వే రిజిస్ట్రేషన్ చేయించుకొన్నాడని పోలీసులు గుర్తించారు.