వరంగల్‌లో ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ హంగామా చేశాడు. ఖైదీలకు సెక్యూరిటీగా వచ్చిన హెడ్ కానిస్టేబుల్ బాలప్రసాద్ తాగిన మైకంలో తుపాకీతో హల్ చల్ చేశాడు. 

వరంగల్‌లో ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ హంగామా చేశాడు. ఖైదీలకు సెక్యూరిటీగా వచ్చిన హెడ్ కానిస్టేబుల్ బాలప్రసాద్ తాగిన మైకంలో తుపాకీతో హల్ చల్ చేశాడు. గోపాల స్వామి మందిరం పరిసరాల్లో తిరుగుతున్న బాలప్రసాద్‌ను చూసి.. స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు.

పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని అతని వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. బాలప్రసాద్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.