సారాంశం

Telangana Government: తెలంగాణ‌లో కొత్త‌గా ఏర్పడిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల నియామ‌కాల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. 
 

Telangana Government Advisors: ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత వ‌రుస స‌మావేశాల‌తో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు చేసింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీఎస్ శాంతికుమారి ఉత్వ‌ర్వులు జారీ చేశారు. ఏడుగురు సలహాదారుల నియామకాలను సీఎస్ ర‌ద్దు చేశారు.

దీంతో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులైన సోమేష్ కుమార్, రాజీవ్ శర్మ, ఏకే ఖాన్, జీఆర్ రెడ్డి, అనురాగ్ శర్మ, చెన్నమనేని  రమేష్, ఆర్ శోభలు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా తమ పదవులను కోల్పోయారు.