కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు పాకేసింది. భారత్ లోనూ ముగ్గురు కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే... ఈ క్రమంలో కొందరు కనీసం మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించడం గమనార్హం. ఇందుకు తాజాగా హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఓ సంఘటనే ఉదాహరణ. కరోనా ఉందేనే భయంతో వృద్ధ దంపతులను ఇంటి నుంచి గెంటేశారు. ఈ సంఘటన అల్వాల్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read ప్రియురాలి పెళ్లి... తట్టుకోలేక ప్రియుడు రైలుకింద పడి...

నగరంలోని అల్వాల్ ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న ఓ వృద్ధ దంపతులు ఇటీవల విదేశాలకు వెళ్లి మూడు రోజుల క్రితం నగరానికి వచ్చారు. వాళ్లు విదేశాల నుంచి వచ్చారు కాబట్టి.. కరోనా సోకి ఉంటుందనే అభిప్రాయం అక్కడివారికి కలిగింది. ఈ క్రమంలో.. అపార్ట్ మెంట్ వాసులంతా.. ఆ వృద్ధ దంపతులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.

అందుకు సదరు దంపతులు అంగీకరించకపోవడంతో. బలవంతంగా బయటకు గెంటేశారు. దీంతో... ఆ దంపతులు ఎవరి సహాయం అందక.. బిక్కుబిక్కుమంటూ రోడ్డుపైనే నిలపడి ఉన్నారు. కాగా... ఆ అపార్ట్ మెంట్స్ లో దాదాపు 50 కుటుంబాలు ఉన్నాయి. మరి ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లిందో లేదో తెలియలేదు.