హైదరాబాద్:  ఏపీ, తెలంగాణ  రాష్ట్రాలకు చెందిన అధికారుల మధ్య  శనివారం నాడు జరగాల్సిన సమావేశం రద్దైంది.  శుక్రవారం అర్దరాత్రి వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య సమస్యలపై చర్చించారు.

నీటిపారుదల శాఖ, ఉద్యోగుల విభజన,ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య శుక్రవారం నాడు అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. ఈ చర్చల సారాంశాన్ని రెండు రాష్ట్రాల సీఎంలకు అధికారులు వివరించనున్నారు.

రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు అవసరమైతే మరో పది రోజుల తర్వాత తిరుపతిలో సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు.

మరో వైపు రెండు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, అధికారులు  సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగానే  ఇవాళ జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసుకొన్నారు.