అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం నాడు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏపీ హైకోర్టు గురువారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంతో పాటు ఎన్నికల నిర్వహణ అంశాన్ని గవర్నర్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరించనున్నారు.

also read:ఇద్దరు కలెక్టర్ల బదిలీ పంచాయతీ: గవర్నర్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు

దీంతో పాటు చిత్తూరు, గుంటూరు కలెక్టర్లను బదిలీ చేయాలని గత ఏడాది మార్చిలో ఎస్ఈసీ ఆదేశించింది. అయితే ఇంతవరకు ఈ రెండు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేయలేదు. నిన్న జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు ఎస్ఈసీ. అయితే ఈ రెండు జిల్లాల్లో మాత్రం జిల్లా జాయింట్ కలెక్టర్లతో ఎస్ఈసీ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకొంది.

ఈ రెండు జిల్లాల  కలెక్టర్ల బదిలీ వ్యవహారాన్ని కూడ గవర్నర్ దృష్టికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకొనే అవకాశం లేకపోలేదు.