Asianet News TeluguAsianet News Telugu

పనికిరాని చేతకాని దద్దమ్మల్లారా, దుర్మార్గులారా: కాంగ్రెస్ పై మంత్రి తలసాని ఫైర్


88 మంది ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అంతేకానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సహకారంతో కాదన్నారు. వారు పార్టీలోకి వస్తామంటే చేర్చుకుంటున్నామన్నారు. ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను నామమాత్రంగా జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. అటు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సైతం సింపుల్ గా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని కోరారు.  

ap minister talasani sriniva yaadav comments on congressparty
Author
Hyderabad, First Published Apr 26, 2019, 4:37 PM IST


హైదరాబాద్: మహాకూటమి అలీ బాబా 40 దొంగల కూటమి అంటూ విరుచుకుపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి తలసాని కాంగ్రెస్ పార్టీ నేతలు దద్ధమ్మలు, దుర్మార్గులు అంటూ విరుచుకుపడ్డారు. 

తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ ఎంతో ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే అక్కడ రైతాంగం ముఖాలలో ఆనందం కనబడటం లేదా అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలవి దిక్కుమాలిన ముఖాలు అంటారు. 

ణహిత చేవెళ్ల లాంటి ప్రాజెక్టులకు తట్టడు మట్టి కూడా వెయ్యలేని దద్దమ్మలు కాంగ్రెస్ పార్టీ నేతలంటూ విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులకు సంబంధించి అడ్వాన్స్ డబ్బులు తీసుకుని ఆ సొమ్ములను రియల్ ఎస్టట్ వ్యాపారంలో మల్లించింది కాంగ్రెస్ పార్టీ నేతలేనని ఆరోపించారు. 

రాజ్యాంగ సంక్షోభం అంటూ గవర్నర్ నరసింహన్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చెయ్యడాన్ని ఖండించారు. రాజ్యాంగ సంక్షోభం ఎలా వస్తుందో తెలుసా అని నిలదీశారు. ప్రజల మధ్యకు వచ్చి చూస్తే రాష్ట్ర అభివృద్ధి తెలుస్తోందన్నారు. మరోవైపు పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు పదవులు, డబ్బు, కాంట్రాక్ట్ ఆశజూపి పార్టీలోకి ఆహ్వానిస్తున్నామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ మండిపడ్డారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత మీలాంటి చెత్తదద్దమ్మలు చేసిన కుట్రలు తెలియవా అంటూ మండిపడ్డారు. పనికిరాని చేతకాని దద్దమ్మల్లారా ఆ నాడు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. 

దద్ధమ్మ, పనికిరాని చెత్త దద్దమ్మలారా గాంధీభవన్ లో కాదు ప్రజలకు మధ్య వచ్చి చూడాలని సూచించారు. గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్నవారిని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ నేతల్లా తాము మాట్లాడాలంటే చాలా ఎక్కువే మాట్లాడతామని చెప్పుకొచ్చారు. 

ఇప్పటికే రెండు సార్లు తెలంగాణ ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టిన విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల్లా విమర్శలు చెయ్యాలంటే తాము అంతకన్నా ఎక్కువే చేస్తామని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారని చెప్పుకొచ్చారు. 

మిషన్ కాకతీయ పూర్తి కావొస్తుందని, కాళేశ్వరం పూర్తి చేసిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడు అని ఆ విజన్ ప్రకారమే ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇష్టం వచ్చినట్లు కేసీఆర్ పై మట్లాడితే సహించేది లేదన్నారు. 

88 మంది ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అంతేకానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సహకారంతో కాదన్నారు. వారు పార్టీలోకి వస్తామంటే చేర్చుకుంటున్నామన్నారు. ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను నామమాత్రంగా జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. అటు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సైతం సింపుల్ గా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని కోరారు.  

Follow Us:
Download App:
  • android
  • ios