హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీశాఖాధికారిగా పనిచేస్తున్న భాస్కర్ రమణమూర్తి గురువారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు.

ఏపీ రాష్ట్రంలో భాస్కర్ రమణమూర్తి గురువారం నాడు ఉదయం హైద్రాబాద్ లోని నాగోల్ లోని ఇంటిపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.నాగోల్ లోని  అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుండి ఆయన దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు. 

1987 బ్యాచ్ కు చెందిన భాస్కర్ రమణమూర్తి అటవీశాఖలో పనిచేస్తున్నాడు. అయితే ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. 
ఈ విషయమై బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తిగత కారణాలతో ఆయన ఆత్మహత్య చేసుకొన్నాడా.. లేక ఇతరత్రా కారణాలతో ఆత్మహత్య చేసుకొన్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన  పరిస్థితులు రమణమూర్తికి ఏమున్నాయనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

రమణమూర్తితో నిన్న ఏం జరిగిందనే విషయమై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.