Asianet News TeluguAsianet News Telugu

బ్యాగులో బుల్లెట్: ముగిసిన పరిటాల సిద్ధార్ధ్ విచారణ... వివరణపై పోలీసుల అసంతృప్తి

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో పరిటాల సిద్ధార్ద్ విచారణ ముగిసింది. బుధవారం ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీల సందర్భంగా సిద్ధార్ధ్ బ్యాగ్‌లో బుల్లెట్ లభ్యమైంది. అది సాయుధ బలగాలు వాడే బుల్లెట్‌గా గుర్తించారు. ఈ బుల్లెట్ సిద్ధార్థ్‌కు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు

ap ex minister tdp leader parital sunita son siddharth
Author
Hyderabad, First Published Aug 21, 2021, 5:27 PM IST

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో పరిటాల సిద్ధార్ద్ విచారణ ముగిసింది. మరోసారి విచారణకు కావాల్సిందిగా ఆయనను పోలీసులు ఆదేశించారు. పోలీసులకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఉన్నతాధికారుల సలహాలతో లీగల్ ఒపీనియన్ తీసుకోనున్నారు ఎయిర్‌పోర్ట్ పోలీసులు. బుధవారం ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీల సందర్భంగా సిద్ధార్ధ్ బ్యాగ్‌లో బుల్లెట్ లభ్యమైంది. అది సాయుధ బలగాలు వాడే బుల్లెట్‌గా గుర్తించారు. ఈ బుల్లెట్ సిద్ధార్థ్‌కు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై రెండు రోజుల క్రితం సిద్ధార్ద్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఇవాళ విచారణకు హాజరయ్యారు సిద్ధార్ధ్.

పరిటాల సిద్ధార్థ వ్యక్తిగత కారణాల నేపథ్యంలో కొన్నేళ్లక్రితం అనంతపురం కలెక్టర్ నుంచి అయిదు లైసెన్స్ తీసుకుని .32 క్యాలిబర్ పిస్టల్ కొన్నారు.  దాని కాలపరిమితి 2019తో ముగియడం, అదే ఏడాది ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఎన్నికలకు ముందే.. తన ఆయుధాన్ని రామగిరి పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేశారు.  అయితే బుధవారం తెల్లవారుజామున ఆయన బ్యాగేజీలో లభించినవి 5.56 క్యాలిబర్ తూటాలు.

Also Read:జవానుతో లింక్స్ : పరిటాల సునీత కుమారుడి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

ఇవి కేవలం సాయుధ బలగాలు మాత్రమే వాడే ఇన్సాస్ రైఫిల్ కు సంబంధించినవి అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ వద్ద 5.56 కి చెందిన అక్రమ ఆయుధం ఉందా? అనుమానాలు కలుగుతున్నాయి.  అయితే ఈ వ్యవహారంలో శంషాబాద్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా నిషేధిత తుపాకీ తూటాలు కలిగి ఉన్న వ్యక్తులను పోలీసులు నిందితులుగా భావించి విడిచిపెట్టరు. అయితే సిద్ధార్థ్ ను మాత్రం వివరణ కోరుతూ సీఆర్పీసీ 41-ఏ కింద నోటీసులు జారీ చేసి వదిలేయడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios